భూమి పుట్టినప్పటి నుంచీ ఉన్న ఆ మొక్కలు… చిన్న చిన్న కీటకాల్ని మాత్రమే ఆరగిస్తాయి. సన్ డ్యూస్, వీనస్ ఫ్లెట్రాప్ లాంటి మొక్కలు… కీటకాల్ని ఆకర్షిస్తుంటాయి. ఏదైనా కీటకం తమపై వాలగానే… దాన్ని బలవంతంగా లోపలికి లాగేసుకొని చంపేస్తాయి. ఆ కీటకంలో గుజ్జును, మాంసాన్నీ పీల్చేస్తాయి.
🔴కొత్త రకం violent మొక్కలు : తాజాగా కెనడాలోని… అంటారియో శాస్త్రవేత్తలు మాత్రం… కొత్త రకం మొక్కల్ని కనుక్కున్నారు. అవి ఎంత ప్రమాదకరమైనవంటే… పెద్ద పెద్ద తొండలు, సాలమాండర్లను కూడా తినేస్తున్నాయి. మన చేతి వేలు సైజులో ఉండే కీటకాల్ని కూడా ఆరగిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఇలాంటి మొక్కలతో జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు.
🔴పిచర్ మొక్కలు :పిచర్ మొక్కలు కెనడాలోని తడి నేలల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి చిన్న చిన్న కీటకాల్ని మాత్రమే తినే మొక్కలు అని ఒకప్పటి శాస్త్రవేత్తలు భావించారు. అప్పట్లో ఆ మొక్కలు సాలీళ్లు, పురుగుల్ని మాత్రమే తినేవి.
🔴ఇప్పుడు పెద్ద జీవుల్ని తింటున్నాయి : కాలక్రమంలో మొక్కల ఆహారపు అలవాట్లు మారాయి. ఇప్పుడు పెద్ద పెద్ద జీవుల్ని తింటున్నాయి. అంటారియోలోని అల్గోంక్విన్ పార్కు… బురద నేలల్లో పిచర్ మొక్కలు సాలమాండర్లను కూడా తింటున్నట్లు గ్వెల్ఫ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
🔴ఇలా చంపేస్తాయ్ : తిరగేసిన గుడి గంటల ఆకారంలో ఉంటాయి ఈ మొక్కల ఆకులు. వీటిలో వర్షపు నీరు స్టాక్ ఉంటుంది. ఏదైనా జీవి ఈ ఆకులలోకి వెళ్లిందంటే చాలు… దాన్ని బలవంతంగా లాగేసుకుంటాయి. బయటకు వెళ్లకుండా చేస్తాయి. ఆ తర్వాత నీటిలోని సూక్ష్మక్రిములకు జీవుల్ని అప్పగిస్తాయి. అదే సమయంలో… ఎండ, నీరు అన్నీ కలగలిసి… ఆ జీవి చనిపోతుంది. ఆ తర్వాత అందులో మాంసం, ఇతర ద్రవాల్ని ఆకులు జీర్ణించుకుంటాయి.ఈ విధంగా ఆ నాన్ వెజ్ మొక్క…చాలా violent..గురు అంటున్నారు సైంటిస్టులు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.