కొన్ని సరదాలు చూడటానికి, వినడానికి సరదాగా అనిపించినా వాటి వలన జరిగే ప్రమాదం సంభవించే అవకాశాలు కూడా ఉంటాయి !! 👉సోషల్ మీడియా పుణ్యమాని ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజ్ సరదా రూపంలో ట్రెండింగ్ అవుతూనే ఉంది.
👉మొన్న ;ఐస్ బకెట్ ఛాలెంజ్ 👉 నిన్న ; కికీ ఛాలెంజ్ ఇప్పుడు తాజాగా. 👉 ‘కౌ కిస్సింగ్ ఛాలెంజ్’
🔴కౌ కిస్సింగ్ ఛాలెంజ్’ : ఈఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసే వారు ఆవులకు లిప్‌కిస్ ఇస్తూ ఆ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమకు తెలిసినవారికి సవాలు విసరాలి.
👉ఒక app ద్వారా మొదలైన ఛాలెంజ్: ఈ ఛాలెంజ్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన ‘క్యాస్టల్’ అనే యాప్ మొదలుపెట్టింది. #KuhKussChallenge హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న ఈ ఛాలెంజ్ స్విట్జర్లాండ్‌తో పాటుగా మిగిలిన దేశాలకు కూడా పాకింది.
♦ఉద్దేశ్యం : ఓ స్వచ్ఛంద సంస్థకు నిధులు చేకూర్చాలనే ఉద్దేశ్యంతో దీన్ని మొదలుపెట్టినట్లు యాప్ సంస్థ చెప్పుకొంది.
🔴ఇవి చాలా ప్రమాదకరం :
ఆవులకు ముద్దుపెట్టే ఈ ఛాలెంజ్ చాలా ప్రమాదకరమైనది. పాలిచ్చే ఆవులు చాలా కోపంగా ఉంటాయి. వాటి దగ్గరకు వెళ్లి ఇలాంటి చర్యలకు పాల్పడితే అవి దాడి చేసే ప్రమాదం ఉంది. అందుకే ఆస్ట్రియా ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంటోందట.
ఈ ఛాలెంజ్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.