ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం తరువాత ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని శాసనసభ పక్ష నాయకుడి పదవిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కు లేదా బాలకృష్ణకు కట్టబెట్టనున్నారని ఊహాగానాలకు పెద్ద ఎత్తున విన్పించాయి.అయితే ఈ ఊహాగానాలకు తెరదించుతూ , పార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు మరొకసారి ఆయనే శాసనపక్ష నేత పదవిని చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అసాధారణ విజయం సాధించిన నేపధ్యం లో చంద్రబాబు అస్త్ర సన్యాసం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు.
🎤దానికి గల కారణాలు: 👉రాష్ట్రం లో పార్టీ అధికారం కోల్పోవడం, 👉అసెంబ్లీ లో కేవలం 23 మంది సభ్యుల మందే బలముండడం తో ఆయన జాతీయ రాజకీయాల పై దృష్టి సారించనున్నారంటూ విశ్లేషణలు చేశారు. 🔴అసెంబ్లీ లో అధికార పార్టీ చేసే అవమానాలను ఎదుర్కొనడం ఇష్టం లేక , చంద్రబాబు అసెంబ్లీకి రాకపోవచ్చునని మరికొంతమంది చెప్పుకొచ్చారు.
👉పోరాట పంథాలొనే : చంద్రబాబు మరొకసారి పోరాట పంథానే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ లో 23 మంది ఎమ్మెల్యేల బలమే ఉన్నప్పటికీ, అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను సమర్ధవంతంగా పోషించడం ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొనాలని ఆయన భావిస్తున్నట్లుగా కన్పిస్తోంది. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎంత మేరకు ప్రజాభిమానాన్ని చూరగొనే విధంగా వ్యవహరిస్తుందన్నది ఇప్పటికిప్పుడు పేర్కొనడం తొందరపాటు చర్యనే అవుతుంది.
🔴పక్కావ్యూహం తోప్రతిపక్ష నేతగా : అధికార పార్టీ ని టార్గెట్ చేసే విషయం లో చంద్రబాబు పక్కావ్యూహం తోనే ముందడుగు వేస్తున్నట్లు ఆయన మాటలద్వారా స్పష్టం అవుతోంది. అధికారం లోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై విమర్శలు చేయకుండా వేచి చూసే ధోరణి అవలంభించాలని నిర్ణయించడం బాబు రాజకీయ పరిణితికి నిదర్శనంగా పేర్కొనవచ్చు . దానికి తోడు ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి జగన్ ఆహ్వానించగానే తిరస్కరించకుండా, పార్టీ తరుపున ప్రతినిధి బృందాన్ని ఆయన నివాసానికి పంపి అభినందనలు తెలియజేయాలని నిర్ణయించడం ద్వారా తాను రానున్న రోజుల్లో పాజిటివ్ దృక్పధం తోనే రాజకీయాలను చేస్తానన్న సంకేతాలను ఇచ్చినట్లయింది.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమే అయినా ఓటమి తరువాత తాము ఎటువంటి గుణపాఠం నేర్చుకున్నామన్న దానిపై రాజకీయ పార్టీల మనుగడ ఆధారపడి ఉంటుంది. 🔴ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కూడా బాధ్యతల నుంచి తప్పుకోకుండా నాయకుడిగా ముందుండి చంద్రబాబు పోరాడాలని నిర్ణయించుకున్నారు, పార్టీ కష్టకాలం లో ఉన్న సమయం లో నాయకుడే చేతులెత్తేస్తే క్యాడర్ మనోధైర్యం దెబ్బతినే ప్రమాదముండడం తో, బాబు ఈ విషయం లో ఆచితూచి అడుగు వేసి సరైన నిర్ణయాన్నే తీసుకుని మరోసారి తన రాజకీయ పరిణితి ని ప్రదర్శించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.