Teluguwonders:
హైదరాబాద్:
వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో క్రిస్ గేల్ జమైకా తల్లవాస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లీగ్‌లో భాగంగా సోమవారం బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
టి 20ల్లో 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా క్రిస్ గేల్ చరిత్ర సృష్టించాడు. మొత్తం 389 మ్యాచ్‌లు ఆడిన క్రిస్ గేల్ 39.07 యావరేజితో 13,013 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో 1000 ఫోర్లు బాదిన తొలి క్రికెటర్ కూడా క్రిస్ గేల్.
1 .టి 20ల్లో క్రిస్ గేల్ రికార్డు
మ్యాచ్‌లు – 389
ఇన్నింగ్స్‌లు – 381
పరుగులు – 13,013
యావరేజి – 39.07
అత్యధిక స్కోరు – 175*
100s – 22
50s – 80
6s – 958
2. టి 20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
13,013 – క్రిస్ గేల్
9922 – బ్రెండన్ మెక్కల్లమ్
9582 – కీరోన్ పొలార్డ్
8803 – డేవిడ్ వార్నర్
8780 – షోయబ్ మాలిక్
8475 – విరాట్ కోహ్లీ
8392 – సురేష్ రైనా
8291 – రోహిత్ శర్మ
8233 – ఆరోన్ ఫించ్
8186 – ఎబి డివిలియర్స్
3. టి 20ల్లో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాళ్లు
1001 – క్రిస్ గేల్
924 – బ్రెండన్ మెక్‌కల్లమ్
860 – డేవిడ్ వార్నర్
798 – ఆరోన్ ఫించ్
792 – శిఖర్ ధావన్
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.