తాజాగా సీఎం జగన్ మంచి తనం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తనుపవర్ లోకి వచ్చాక ఆయన శత్రువు ని ఎలా డీల్ చేశారు అన్నవిషయం పై వివరాల్లోకి వెళితే :
🔶నన్నూరి నర్సిరెడ్డి జగన్ పై పిట్ట కథ :
ఆ మద్య తెలుగు దేశం పార్టీ భారీ బహిరంగ సభలో నన్నూరి నర్సిరెడ్డి ప్రత్యక్షం అయ్యి జగన్ ని దొంగగా చిత్రీకరించి ఒక కథ చెప్పారు..అందరూ చూస్తుండగా జగన్ గురించి ఆ పిట్ట కథ చెప్పాడు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు పగలబడి నవ్వుకున్నారు..జగన్ ని టార్గెట్ చేసుకొని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు పొందడం కోసం నానా తంటాలు పడే వారు. ఆ పిట్ట కథ సోషల్ మీడియాలోవైరల్ అయ్యింది. అందరూ ఏమవుతుందా అని చూసారు.
🔴కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు: అనుకోకుండా ఇప్పుడు ఏపిలో వైసీపీ పాలన వచ్చింది..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించారు. అయితే గతంలో తనపై ఇలాంటి నీచమైన కామెంట్స్ చేసి సెటైర్లు వేసిన నన్నూరి నర్సిరెడ్డి పై ఏ రేంజ్ లో కోపం తెచ్చుకుంటారో అని అనుకున్నారు..కానీ సీఎం జగన్ అలా చేయలేదు..
🔶శత్రువుకి కూడా అతిథి మర్యాద :
ఆయన మీద కోప్పడడం కాదు కదా..ఆయనను ఇంటికి పిలుపించుకొని మరీ తన కుటుంబ సభ్యులకు పరిచయం చేసి..తనతో పాటు విందు ఏర్పాటు చేసి సంతోష పరిచారు.
🔴నేను సీఎం అవ్వడానికి కారణం మీరే అంటూ : బోజనం అయ్యాక.. నన్నూరి నర్సిరెడ్డి కి తిరుపతి నుంచి తెప్పించిన లడ్డు బహుమానంగా ఇచ్చి..గతంలో మీరు చేసిన కామెంట్ నాలో ఇంకా కసిని పెంచిందని..ఎలాగైనా సీఎం కావాలనే లక్ష్యం నా ముందు ఉంచిందని మీరు అన్నదానికి నేను బాధపడటం లేదని..అంతే కాదు మీకు ఇక నుంచి ఎలాంటి అవసరమున్నా నేనున్నానన్న విషయం మర్చిపోకండి అని భరోసా ఇచ్చారు. అలా శత్రువు ని కూడ మిత్రునిగా చూసిన జగన్ మంచితనానికి నన్నూరి నర్సిరెడ్డి కళ్లు చెమ్మగిల్లాయట. అంతే కాదు 👉ఆ మద్య వైజాగ్ లో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కలవడానికి మొదటి సారి వైజాగ్ వచ్చిన ఆయనను కొంత మంది విద్యార్థులు తమ స్నేహితుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడని చెప్పగానే వెంటనే కలెక్టర్ కి ఆ బాధితుడికి రూ.25 లక్షలు వైద్య ఖర్చుకోసం మంజూరు చేశారు.
👉తాను కాన్వాయ్ లో వెళ్తున్న సమయంలో కొంతమంది బాధితులు వస్తే వాహనం ఆపి మరీ వారి బాధలు తెలుసుకొని వాటిని తీరుస్తానని భరోసా ఇచ్చారు. చెమ్మగిళ్లాయట.. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చూస్తుంటే అన్నం మొత్తం ఉడికిందా అనేదానికి ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే సరిపోతుందని అంటారు. ఇప్పుడు జగన్ దూకుడు..పరిపాలనా విధానం చూస్తుంటే భవిష్యత్ లో ఆయన పాలన ఎంత గొప్పగా సాగుతుందో అనడానికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు..చాటుతున్న మంచితనం అందుకు నిదర్శనం అని చెప్పొచ్చు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.