Teluguwonders:
దేవదాయ శాఖలో అన్యమతస్థులు పనిచేస్తున్నారంటూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో వివాదం నెలకున్న విషయం తెలిసిందే.హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆలయాల్లో అన్యమతస్థులను ఉద్యోగులుగా నియమిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తడంతో ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ కీలక ఉత్తర్వులు జారీచేసింది .
🔴వివరాల్లోకి వెళ్తే :
తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక జెరూసలెం, హౌజ్ యాత్రల గురించి ముద్రించి ప్రచారం చేయడంతో దుమారం రేగింది. అలాగే శ్రీశైలంలో హిందూవేతరులకు వేలం ద్వారా దుకాణాలను కట్టబెట్టారంటూ వీహెచ్‌పీ, బీజేపీలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. శ్రీశైలం విషయంలో వివాదం నెలకోవడంతో వేలంను రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసింది. పూర్తి వివరాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని, దేవాలయాల్లో రాజకీయాలకు తావులేదని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు టెండర్ల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈవో శ్రీరామచంద్రమూర్తిపై కూడా బదిలీవేటు పడింది.
🔴కఠిన చర్యలు :
హిందూ పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సైతం హెచ్చరించారు. హిందూ ఆలయాల్లో అన్యమతస్థులు ఉంటే చర్యలు తప్పవని.. భక్తుల మనోభావాలు కాపాడేందుకు అవసరమైతే అధికారులు, ఉద్యోగుల గృహాల్లో ఆకస్మిత తనిఖీలు కూడా నిర్వహిస్తామని ప్రకటించారు.
👉ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ శనివారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. తమ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులంతా హిందువులేనని 15 రోజుల్లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. దేవదాయ శాఖలో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉన్నారంటూ మీడియాలో వస్తున్న ఆరోపణలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పేర్కొంది. శాఖలో పనిచేసే శాశ్వత, ఒప్పంద, పొరుగుసేవలు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులు స్వీయ ధ్రువీకరణతో అఫిడవిట్ దాఖలు చేయాలని దేవదాయ శాఖ అదనపు కమిషనర్ కె.రామచంద్రమోహన్ స్పష్టం చేశారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.