Teluguwonders:
ధోని.. ఎం ఎస్ ధోని.. మిస్టర్ కూల్.. ఇండియా సూపర్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ లలో ఒకరు. ఇండియాకు అనేక విజయాలను ఒంటిచేత్తో అందించాడు. బెస్ట్ ఫినిషర్ గా ధోని పేరు ఉన్నది. అయితే ఇటీవల కాలంలో ధోని స్లో బ్యాటింగ్ కారణంగా విమర్శలు వచ్చాయి. ధోని వరల్డ్ కప్ లో ఆడతారని ఎవరు అనుకోలేదు. అనూహ్యంగా వరల్డ్ కప్ లో ఆడారు. చివరి మ్యాచ్ లో ఉద్విగ్నభరితంగా కన్నీరు పెట్టారు. ఆ మ్యాచ్ చివరి వరకు సాగింది అంటే అందుకు ధోనీనే కారణం అని చెప్పొచ్చు.
వరల్డ్ కప్ తరువాత వెస్ట్ ఇండీస్ టూర్ కు ఎంపికైనా.. ఈ టూర్ కు రాలేనని చెప్పి పక్కకు తప్పుకున్నారు. రెండు నెలల పాటు సైన్యంలో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. గౌరవ లెఫ్టినెంట్ హోదాలో ధోని ఉన్న సంగతి తెలిసిందే.
హోదాలో ఉన్న వ్యక్తులు సైన్యంలో పనిచేయాల్సిన అవసరం లేదు. కానీ, ధోని మాత్రం లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సైన్యంలో పనిచేసేందుకు సిద్ధం అయ్యారు. దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.
ధోని ప్రస్తుతం కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నారు. కల్నల్ హోదా అయినప్పటికీ ఒక సామాన్య సైనికుడిగా తనను ట్రీట్ చేయాలని చెప్పాడు. ఆ సైనికులతో కలిసి భోజనం చేయడం వారితో కలిసి వీధుల్లో పహారా కాయడం వంటివి చేస్తున్నాడు. క్రికెటర్ గా ఎన్నో విజయాలు అందించిన ధోని, ఒక సామాన్య సైనికుడిగా కాశ్మీర్లో పహారా కాయడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ధోని దేశభక్తికి హ్యాట్సాఫ్ చెప్పారు నెటిజన్లు.
తాజాగా ధోనికి సంబంధించిన ఫోటో ఒకరి సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. ధోని పహారాకు వెళ్లే ముందు తన షూను పాలిష్ చేసుకుంటుండగా కొందరు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో వైరల్ గా మారింది. అయితే, ఈ ఫోటో ఆర్టికల్ 370 రద్దు కు ముందు తీసిన ఫోటో అయ్యి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ మొబైల్ ఫోన్ అందుబాటులో లేదు. ఇంటర్నెట్ సౌకర్యం లేదు. కేవలం శాటిలైట్ ఫోన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.