Teluguwonders:
డబ్బులిస్తే.. ఆ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నానో లేదో చెప్తాఅంటున్నారు ధోని సినిమా హీరో
🔴వివరాల్లోకి వెళ్తే :
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..నటి రియా చక్రబోర్తి డేటింగ్‌లో ఉన్నారని చాలా కాలంగా బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీనిపై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మీడియా ద్వారా స్పందించారు.
🔴సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..:
అలా ‘కాయ్ పోచే’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు సుశాంత్. ఆ తర్వాత వచ్చిన ‘ఎంఎస్ ధోనీ- ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాతో ఆయన కెరీర్‌కు బ్రేక్ దొరికింది. ఇటీవల సుశాంత్ నటించిన ‘చిచ్ఛోరే’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని రాబడుతోంది. 👉‘నేను అడిగినంత డబ్బిస్తే రియాతో డేటింగ్‌లో ఉన్నానో లేదో చెప్తాను’ అంటున్నారు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. సుశాంత్.. ‘తూనీగ తూనీగ’ ఫేం రియా చక్రబోర్తితో డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. వీరిద్దరూ కలిసే విహారయాత్రలకు వెళుతున్నారు. దీనిపై మీడియా వర్గాలు ఎన్నిసార్లు ప్రశ్నించినా ఏమీ లేదనే మాట దాటేస్తున్నారు. తాజాగా సుశాంత్ తన ప్రేమ వ్యవహారంపై ఎట్టకేలకు పెదవి విప్పారు. ‘మీరు సింగిల్‌గానే ఉన్నారా?’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సుశాంత్ ఇచ్చిన సమాధానం షాక్‌కు గురిచేస్తోంది.
‘నేను ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదివాను. ఆ తర్వాత హీరో అయ్యాను. ఇదంతా నా అదృష్టం వల్ల జరగలేదు. నేను ఆ రకంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్లాను కాబట్టి జరిగింది. కాబట్టి నేను నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై సమాధానం ఇవ్వాలంటే నేను చాలా డబ్బు తీసుకుంటాను. నాకు ఓ పెద్ద పేరున్న మ్యాగజైన్‌పై నా ఫొటోతో పాటు డబ్బు కూడా కావాలి. అవి ఇస్తేనే నేను డేటింగ్‌లో ఉన్నానో లేనో చెప్తాను.’ అని చమత్కరించారు.
గతంలో రియా గురించి సుశాంత్ మాట్లాడుతూ.. ‘నా ప్రేమ గురించి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. ఫస్ట్ స్టేజ్‌లో ఉన్న విషయాల గురించి ప్రజలు అన్నీ తెలిసినట్లుగా ఏవేవో ఊహించకూడదు. ఒకవేళ నేను ప్రేమలో ఉన్నానో లేదో చెప్పాలంటే నేను ప్రేమించే వ్యక్తి నుంచి అనుమతి తీసుకోవాలి’ అంటూ మాటదాటేశారు. గతంలో సుశాంత్.. అంకితా లోఖాండే అనే బుల్లి తెర నటితో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ‘పవిత్ర రిష్తా’ అనే ధారావాహికలో కలిసి నటించారు.
వీరి కెరీర్ ప్రారంభమైంది కూడా ఈ సీరియల్‌తోనే. ఆ తర్వాత సుశాంత్ దశ తిరిగింది. సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.