సాధారణంగా తీరికవేళల్లో కాలాన్ని గడపడానికి ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది దాన్నే హాబీ అంటాము మనం .అయితే ఈ hobby’s మామూలు వారికి మాత్రమే కాదు.తీరిక లేకుండా గడిపే హీరోయిన్స్ కి కూడా ఉంటాయి .అది కూడా మనకంటే ఎక్కువగా.. ఇదంతా ఎందుకు అన్ని హాబీస్ ఉన్న హీరోయిన్ ఎవరు అంటారా..ఆమె..దిగాంగనా సూర్యవన్షి.
💖దిగాంగనా సూర్యవన్షి : హిందీ సీరియల్స్‌లో నటించి.. మెప్పించి ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా విజయకేతనాన్ని ఎగురవేసిన ఈ హీరోయిన్ కి లేని హాబీ అంటూ మాక్సిమం లేదు.
💚 బుల్లితెర పైన ఇటు వెండితెరపైన :
సీరియల్‌లో కనిపించినవాళ్లు.. సినిమాల్లో హిట్ కొట్టినట్టు ఎక్కడా లేదు.. కానీ ఆ క్రెడిట్ను దక్కించుకుంది దిగాంగనా.
🔸బుల్లి తెరపైన : ఐదు సంవత్సరాల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా టీవీలో కనిపించింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు టీవీకి కామా పెట్టేసింది. 👉ఆ తర్వాత 2009లో శకుంతల అనే సీరియల్‌లో సపోర్టింగ్ రోల్ చేసింది. 👉2012లో మొదలైన ఏక్ వీర్ కీ అర్‌దాస్.. వీర అనే సీరియల్‌తో మంచి పాపులారిటీ సంపాదించింది.
🔴వీర సీరియల్‌కి స్టార్ పరివార్ అవార్డును కూడా గెలుచుకున్నది.
💚బిగ్ బాస్ షో లో : అతిచిన్న వయసులో హిందీ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచి ఈ అమ్మడు పేరు తెచ్చుకుంది. కాకపోతే తొందరగా ఆ ఇంటిని వదిలి బయటకు వచ్చేసింది. 2015లో ఈ అమ్మడు ఇండియా యువ అవార్డుల్లో యూత్ ఐకాన్ అవార్డును అందుకుంది.
🔸వెండి తెర పైన : ఎంతో టాలెంట్ ఉన్న దివ్యంగనా ఇప్పుడు తెలుగు పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించదలుచుకున్నదిదిగాంగనా సూర్యవన్షి… హిప్పీతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఈనటి కి ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా టాలీవుడ్ నుండి మాత్రం ఆఫర్స్ బాగానే వస్తున్నట్లుగా వినికిడి..
💕మరి ఈ ముద్దుగుమ్మ hobby’s ..ఏంటో తెలుసుకుందాం రండి :
💚 నవలా రచన : 16 యేండ్ల వయసులో ఈ ముద్దుగుమ్మ వేవ్స్.. ద ఎండ్‌లెస్ ఎమోషన్స్, నిక్సీ.. ద మెర్‌మేడ్ అండ్ ద పవర్ ఆఫ్ లవ్ పేరుతో ఒక నవల రాసింది.
💚పాటల రచన : దిగాంగనా ఇప్పటిదాకా 50 పాటల దాకా రాసింది. పది సంవత్సరాల వయసులో దేవీ ఖీర్ కాలో పేరుతో భక్తి ఆల్బమ్‌ను రిలీజ్ చేసింది.
💚మరెన్నో hobbys: హ్యారీపోటర్ పుస్తకాల సిరీస్ ని చాలా ఇష్టపడే దివ్యంగనా కి పెయింటింగ్, స్కేటింగ్, బ్యాడ్మింటన్ ఆడడం, ఎప్పుడూ ఏదో ఒకటి రాయడం ఇలా ఇంకెన్నో hobbys ఉన్నాయట .
💕ప్రత్యేకమైన హాబీ : పాలతో స్నానం : దిగాంగనా సూర్యవన్షి పుట్టినరోజున పాలతో స్నానం చేస్తుందట. ఆ రోజున తనొక రాకుమారిలా ఫీలవుతుందట. బంగారం, జెమ్‌స్టోన్స్‌తో ఒక క్రౌన్ చేయించుకుంది దిగాంగనా. ప్రతీ పుట్టినరోజుకు దాన్ని కచ్చితంగా ధరిస్తుందట.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.