అశ్విని దేవతల గురించి మీకు తెలుసా..??

Spread the love

పురాణాల్లో అశ్వని దేవతలకు..విశేషమైన ప్రాచుర్యం ఉంది..

🔴ఎవరీ అశ్వని దేవతలు..? అంటే ; అశ్వని దేవతలు..దేవతలకు వైద్యులు.

🔯విష్ణు పురాణం ప్రకారం అశ్వని దేవతల పుట్టుక : సూర్యుని భార్య సంజ్ఞాదేవి అతని తేజస్సుకు భరింపలేక అశ్వరూపములో కురుదేశమున ఉండగా సూర్యుడీమెతో అశ్వ రూపమున సంగమిస్తాడు. అప్పుడు వారికి పుట్టిన సంతానం అశ్వినులైనారు. 🔹నాసత్యుడు,
🔹దనుడు వారి పేర్లు. వారికి జన్మించిన మూడవ కుమారుడు
🔹దేవంతుడు ..వీరి నే అశ్వని దేవతలు..ఆంటారు.

🔯అశ్వని దేవతలు సోమ రసం(అమృతం)పొందిన కధ: శర్వాతిఅనే రాజుకు 4000 మంది భార్యలు. కాని సంతానం లేదు. చివరికి ఒక భార్యవల్ల సుకన్య అనే అందాల రాశి జన్మిస్తుంది. సుకన్య పెరిగి పెద్దదైయింది. అతని రాజ్యానికి దగ్గరలో ఉన్న
నందనవనం అనే ప్రదేశంలో భృగు మహర్షి కుమారుడు చ్యవన మహర్షి తపస్సు చేసుకొంటూ వుండేవాడు. అతని చుట్టూ పుట్ట చెట్లు అతడు కన్పించనంతగా పెరిగాయి. రాజు, రాణులు తమ కుమార్తె సుకన్యతో ఈ ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఈ బాలిక పుట్టలోవున్న మహర్షి కళ్ళను కాంతి అనుకొని ఓ పుల్ల మొనతో గుచ్చగా అతడు అంధుడయ్యాడు. కాని అతడామెను శపించలేదు. కాని ఆ కారణాన ఆ రాజ్యంలో వర్షాలు పడక పంటలు పండక గొప్ప కరువు వచ్చింది. దానికి కారణం తెలియక రాజు వేదన చెందు చుండగా సుకన్య తను చేసిన అపరాధాన్ని
తండ్రికి చెప్పింది. రాజు చ్యవనుని వద్దకు వెళ్ళి తమను మన్నించమని వేడు కొనగా, చవనుడు ఆమెను తన కిచ్చి వివాహము చేయమని కోరాడు. రాజు మనోవ్యధ చెందగా,సుకన్య తన తండ్రిని మెప్పించి ఆమె చ్యవనుని వివాహము చేసుకొని అతనికి సపర్యలు చేయసాగింది. అశ్వనీ కుమారులు ఇది గమనించి అతని అంధత్వాన్ని పోగొడతామని,తమలో ఒకరిని వివాహమాడమని కోరగా ఆమె అందుకు నిరాకరించింది. అశ్వనీ కుమారులు చ్యవనుని అంధత్వం పోగట్టి తాము కూడా చ్యవనుని రూపం దాల్చుతామని అందులో నీ ఇష్టం వచ్చిన వారిని వివాహమాడమని కోరి, చ్యవనుని అంధత్వం పోగొట్టి తాము కూడా చ్యవనుని రూపముదాల్చారు. అయినను సుకన్య ఆ ముగ్గురిలో నిజ చ్యవనునే
ఎంచుకొన్నది. చ్యవనుడు అందుకు సంతోషించి, అశ్వనీ దేవతలను ఓ వరం కోరుకొమ్మనగా ఇంద్రుడు మమ్ము సోమరసం సేవించవద్దని ఆజ్ఞాపించాడు. అదీ మేము కూడా సేవించే అవకాశం కల్పించమని కోరగా, చ్యవనుడు ఇంద్రునితో వాగ్యుద్ధంలో జయించి వీరికి సోమరసం త్రాగే భాగ్యం కల్గించాడు.

👉 అశ్వనీ దేవతల సహకారం తో నకులసహదేవుల పుట్టుక : దూర్వాసుని మంత్ర శక్తితో కుంతి కర్ణుని, ధర్మజుని, భీముని, అర్జునులకు జన్మనిచ్చింది. ఆ మంత్రాన్ని ఆమె తన సవతి మాద్రికి ఉపదేశించగా ఆ మంత్ర మహిమతో ఆమె
అశ్వనీ దేవతలను ధ్యానించి నకులసహదేవులకు జన్మనిచ్చింది. 👉ఈ విధంగా అశ్వని దేవతలు పురాణాలలో..ముఖ్య పాత్ర వహించారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading