Teluguwonders:
ప్రస్తుత కాలం లో మనం ఒక పని చేస్తున్నప్పుడు ఒత్తిడికి గురై అది తలనొప్పి గా మారి మనల్ని బాధపడేలా చేస్తుంది. తల నొప్పి అనేది తల లేదా మెడ ప్రాంతంలో ఎక్కడో చోట ఉండే నొప్పి.తరచుగా తలనొప్పితో వస్తుంటే అశ్రద్ధ చేయకూడదు. మనం ఒత్తిడికి గురై నప్పుడు కానీ టెన్షన్ పడినప్పుడు కానీ సరిగా మనకి నిద్రలేకపోవడం వల్ల కానీ… ఇలా పలు రకాల కారణాలతో తలనొప్పి బాధిస్తుంది.తలనొప్పి కారణాలు ఏవి ఐనా వాటి నివారణకు చికిత్స చేయించుకోవాలి. లేకుంటే కొన్ని రకాల తలనొప్పులు రోగికి ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదముంది.తలనొప్పికి కారణాలు ఏవి ఐనా కావచ్చు , దాని ఎఫెక్ట్ మాత్రం మాములుగా ఉండదు. అందుకే మనలో చాలామంది తలనొప్పి లక్షణాలు కనపడగానే తొందరపడి ఇష్టం వచ్చిన టాబ్లెట్ లు వేసుకుంటారు. వాటి వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్ లు వస్తున్నాయో అది గ్రహించటలేదు. అది మనం గ్రహించేసరికి మనం హాస్పిటల్ లో ఉంటున్నాము. దానికన్నా ముందు టాబ్లెట్ లకు బదులు తలనొప్పి తగ్గడానికి కొన్ని అనువైన చిట్కాలను తీసుకొని మీ ముందుకు వచ్చాను….సాధారణంగా పెద్ద వాళ్ళుకు శరీరంలో ఎక్కడైనా నొప్పిగా అనిపిస్తే వెంటనే ఒక టాబ్లెట్ వేసేస్తారు….ఇది చదువుతున్న వారు మీ ఇంటిలో చదవుకోని వారికి, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఈ చిట్కాల గురించి చెప్పండి.
తలనొప్పి తగ్గే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.
నీళ్ళు ఎక్కవుగా త్రాగాలి :
ఒక్కోసారి విపరీతమైన తలనొప్పికి డీ హైడ్రెషన్ కూడా కారణమవ్వచ్చు. అందుకని ఒక గ్లాస్ నిండా చల్లటి నీళ్లు తాగండి.అంతే తలనొప్పి తగ్గుముఖం పట్టడం మీరు గమనిస్తారు.
రిలాక్స్ అవ్వడం :
తలనొప్పి వల్ల మీకు చిరాకు తెప్పిస్తుంటే కాసేపు అన్ని పనులు పక్కన పెట్టి రిలాక్స్ అవ్వడం మంచిది. దీని వల్ల అలసట తగ్గి తలనొప్పి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది.
డైట్ :
ఒక్కోసారి మనం తీసుకొనే ఆహారం కూడా తలనొప్పికి కారణమవ్వచ్చు.కాబట్టి మీ ఆహార పద్ధతులను మార్చేటప్పుడు కొంత జాగ్రత్త గా ఉండటం మంచిది. ఏవి పడితే అవి తిన్న మనిషికి అవి పడక తిన్న వాటిని వాంతుల రూపంలో బయటికి పంపివేస్తుంది. దీని వల్ల మనుషులు ఏది సరిగ్గా తినలేరు. ముఖ్యం గా బయట తినే ఫాస్ట్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు చూసి తినండి .
ఎక్సర్ సైజ్ :
సాధారణ తలనొప్పి ఉన్న వాళ్ళకు ఇది మంచి చిట్కా , అనువైన ఎక్సర్ సైజు ను ఎంచుకొని చేయడం మంచిది. దాని వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి తలనొప్పి తగ్గే అవకాశాలు ఉన్నాయి.
తల మసాజ్ :
మీకు మసాజ్ గురించి తెలిసే ఉంటుంది.రకరకాల స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందాలన్నా , టెన్షన్ నుండి రిలాక్స్ అవ్వాలన్నా మసాజ్ చక్కటి పద్ధతి, తలనొప్పికి పని ఒత్తిడి కూడా కారణం. మెడ మసాజ్ చేస్తే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది.
వేడి నీళ్లతో తల స్నానం :
తలనొప్పి ఎక్కువుగా ఉంటే గోరువెచ్చటి నీటితో తల స్నానం చేసేయండి. తలనొప్పిని చేతితో తీసిపడేసినట్టుగా రిలాక్స్ గా ఫీల్ అవుతారు.
1 . కొబ్బరి నూనె తో మర్దన చేసుకోండి.తలకు కొబ్బరి నూనె తో పది, పదిహేను నిముషాలు మర్దనా చేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది.వేసవి లో మీరు తలనొప్పి బారిన పడితే ఈ ఇంటి చిట్కా చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది మాడుకు చల్లదనాన్ని ఇచ్చి నొప్పి తగ్గిస్తుంది.
-
ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెము నిమ్మరసం కలపండి.ఈ మిశ్రమం తాగి చూడండి.మీ నొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ వంటింటి చిట్కా చాలా తలనొప్పులకు ఉపయోగకరం గా పనిచేస్తుంది.ఎందుకంటే చాలా తలనొప్పులు కడుపులో గ్యాస్ వల్ల వస్తాయి. ఈ మిశ్రమం మీ గ్యాస్ ను, తలనొప్పిని కూడా వదిలిస్తుంది.
-
ధనియాలు , చక్కెర , నీళ్ళు కలిపి తాగిన మీ తలనొప్పి తగ్గుతుంది.మీకు జలుబు వల్ల వచ్చిన తలనొప్పి ఐతే , ఈ వంటింటి చిట్కా చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది .
-
ఎక్కువ మందికి తలనొప్పి రావడానికి ప్రధాన కారణం సరైన నిద్ర లేకపోవడమే .అందువల్ల తలనొప్పి తగించుకోవాలి అంటే , ముందు తలనొప్పి రాకుండా చూసుకోవాలి. అందుకని రోజుకు కనీసం 8 గంటలు పాటు నిద్రపోతే తలనొప్పులు దూరం అవుతాయి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.