ఫ్రిజ్ లో ఈ పదార్థాలను ఉంచకూడదు..

Spread the love

మనం సాధారణం గా మనం తినే కూరగాయలు , పండ్లు ఇలా చాలా వాటిని నిల్వ వుంచటానికి ఫ్రిజ్లలో ఉంచుతాం . ఇలా భద్రపరిచి ఎక్కువ రోజులు వాడుకుంటుంటాము. కానీ అన్ని పదార్దాలనూ ఫ్రిజ్ లో ఉంచవచ్చా అంటే కొన్ని పదార్థాలను ఫ్రిజ్లో నిల్వ వుంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు .
అవేంటంటే :
🔅ఉల్లిపాయలు :

వీటిని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల మృదువుగా మారతాయి . పైగా నిమ్ము తగలడం వల్ల బూజుపట్టే అవకాశం కూడా ఉంది . అందుకే ఉల్లిపాయల్ని చల్లని , పొడి వాతావరణంలో , ఇతర కూరగాయలకు దూరంగా నిల్వ చేయాలి . లేదంటే మిగిలిన కూరగాయలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది.

🔅అరటిపండ్లు :

వీటి రుచీ సహజంగా , మధురంగా వుంటుంది . అరటిపండ్లని ఫ్రిజ్లో నిల్వ చేయడం వల్ల వాటి సహజ రుచితో పాటు అందులోని పొటాషియం కూడా పోతుంది .

🔅బంగాళదుంపలు :

వీటిని ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ వుంటాయి కానీ దుంపల్లోని పిండిపదార్థం చక్కెరగా మారిపోతుంది .

🔅టమాటాలు :

టమాటాలని ఫ్రిజ్లో వుంచడంవల్ల రుచిని కోల్పోవడమే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా ఉంది.

🔅ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిలని ఫ్రిజ్లో పెడితే దాని స్థిరత్వాన్ని కోల్పోతుంది . పైగా హానికారక క్రియులు తయారై అనారోగ్యాన్ని కలిగిస్తాయి .

వీటిని ఫ్రీజ్ లో నిల్వ వుంచడం వల్ల వాటి సహజ గుణం , రుచి కోల్పోతాయట . తెలిసింది కదా..కాబట్టి పైన చెప్పిన వాటిని ఫ్రిజ్ లో ఉంచకండి*


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading