ఫ్రాన్స్ లో ఎప్పుడు పర్యాటకులతో రద్దిగా ఉండే టవర్ వద్ద సోమవారం గందరగోళం వాతావరణం ఏర్పడింది. ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్‌ను నిర్మించి గత బుధవారంతో 130 ఏళ్లు పూర్తైన విషయం తెలిసిందే. ఈ లోగా ఈ గందరగోళం తో ఈఫిల్ టవర్ మళ్ళీ వార్తల్లో నిలిచింది.
🔴అసలు ఏమయ్యింది .: ఒక గుర్తు తెలియని వ్యక్తి అనుమతి లేకుండా టవర్‌పై ఎక్కే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బందితో పాటు పర్యాటకులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వివరాలను బట్టి చూస్తే సోమవారం మధ్యాహ్నంసుమారు 2.15 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం ప్రకారం ఆగంతకుడు 324 మీటర్లు(దాదాపు 1.063 ఫీట్లు) పైకి ఎక్కినట్లు తెలుస్తుంది.
🔴టవర్‌లోని రెండో లెవల్ నుండి : ఆ ఆగంతకుడు. టవర్‌లోని రెండో లెవల్ వరకూ అంటే దాదాపు గ్రౌండ్ లెవల్ నుంచి 149 మీటర్లు మాములుగా వెళ్లి అక్కడి నుంచి పైకి పాకడం మొదలు పెట్టాడు.
🔴ఈఫిల్ టవర్ ఖాళీ చేయించాల్సిన పరిస్థితి :
‘‘ఇక క్లయింబర్ మాకు కనిపించాడు. అతన్ని ఆపాలి.. అందుకోసమే మేం ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించాము. పరిస్థితులు మెరుగుపడేంత వరకూ పర్యాటకులకు తన సందర్శనాన్ని వాయిదా వేసుకోవాలని కోరుతున్నాము’’ అని ఓ అధికారి తెలిపారు. సంఘటన పై వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఆ విధంగా పర్యాటకులను అక్కడి నుంచి పంపించారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.