ఐన్‌స్టీన్.. ప్రపంచంలోనే అత్యంత మేధావిగా పేరొందిన భౌతిక శాస్త్రవేత్త.జర్మనీకి చెందిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 14 మార్చి, 1879 జన్మించారు. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన జనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని ఆయనే ప్రతిపాదించారు. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc2 ను కనిపెట్టింది కూడా ఆయనే. అపర మేథావిగా పేరొందిన ఐన్‌స్టీన్ 76 ఏళ్ల వయస్సులో 1955, ఏప్రిల్ 18న న్యూజెర్జీలోని ప్రిన్‌సెటాన్ ఆసుపత్రిలో నిద్రలోనే కన్నుమూశారు.
🔴ఆయన కోరిక పూర్తిగా నెరవేరలేదు :
మరణం తర్వాత తన శరీరాన్ని పూర్తిగా దహనం చేయాలని, తన భౌతిక కాయంపై ఎలాంటి పరిశోధనలు చేయకూడదని కోరారు. అయితే, ఆయన అనుకున్నది మాత్రం జరగలేదు. ఐన్‌స్టీన్ మరణం తర్వాత మృతదేహానికి డాక్టర్ థామస్ హార్వే..అనే వైద్యుడు పంచనామా నిర్వహించారు.
🔴ఐన్‌స్టీన్ మెదడును దొంగిలించాడు: అయితే పంచనామా నిర్వహించిన థామస్. హార్వే ఐన్‌స్టీన్ మెదడును దొంగిలించాడు.ఇలా చేసినట్టు ఐన్‌స్టీన్ కుటుంబికుల కు కూడా తెలియదు.ఎవరికి తెలియకుండా హార్వే ఈ చర్యకు పాల్పడ్డాడు.
🔴 మెదడు పై పరిశోధనలు చేశాడు :
ఐన్‌స్టీన్ మెదడును దొంగిలించిన హార్వే..దానిపై ఎన్నో పరిశోధనలు చేశాడు దాని బరువును 1230 గ్రాములు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఆ మెదడును మొత్తం 240 ముక్కలు చేశాడు. వాటిని రసాయనాలతో కూడిన జాడీలో పెట్టి తన పరిశోధనశాలలోని బేస్మెంట్‌లో జాగ్రత్తపరిచాడు. అసలు ఐన్‌స్టీన్ మెదడుపై అధ్యయనం చేయడానికే హర్వే ఈ దొంగిలింపు చర్యకు పాల్పడినట్లు తెలిసింది.
🔴ఆ మెదడుతో ప్రపంచ పర్యటన : ఆ తర్వాత ఆ మెదడుతో హర్వే ప్రపంచమంతా పర్యటించాడు. 40 ఏళ్ల తర్వాత ఆ ముక్కలను శాస్త్రవేత్తలకు అప్పగించాడు. అప్పటి వరకు ఎవరికీ ఈ విషయం తెలియకపోవడం గమనార్హం.
🔴 ఆ తర్వాత ఎంతో మంది శాస్త్రవేత్తల పరిశోధనలు : ఆ తర్వాత
ఐన్‌స్టీన్ మెదడుపై పరిశోధనలు చాలా ఏళ్లు రహస్యంగానే సాగాయి. అతని మేధస్సుకు వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు ఎంతో మంది ఆతృతగా ఎదురుచూశారు. చివరికి 1985లో ఐన్‌స్టీన్ మెదడు ప్రత్యేకతలను బయటపెట్టారు.
🔴ఆయన మెదడు యొక్క ప్రత్యేకత : ఐన్‌స్టీన్ మెదడు సాధారణ మనుషులకు ఉండే మెదడు కంటే విభిన్నమైనది. 👉సాధారణ మెదడులో కంటే 17 శాతం అధిక న్యూరాన్లు ఐన్‌స్టీన్ మెదడులో ఉన్నాయన్నారు. దీనివల్ల ఆయన మెదడు చురుగ్గా పనిచేసేదని తెలిపారు. 👉ఆయన మెదడులోని లోయర్ పరిటాల్ లాబ్ 20 శాతం పెద్దదిగా ఉండటం వల్ల ఆయన గణితంలో నైపుణ్యవంతులయ్యారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఈ పరిశోధనాలన్నింటికి మూల కారణం అయిన థామస్ హార్వే ను మాత్రం వృత్తి విరుద్ధంగా ప్రవర్తించినందుకు గాను తన ఉద్యోగం నుండి తొలగించారు చివరికి . హర్వే చేసిన చర్య తప్పే అయినా ఆ తర్వాత మెదడు పనితీరుపై శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపయోగకరం గా నిలిచింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.