అమ్మాయిలు షార్ట్ స్కర్ట్ లు వేసుకుంటే ఆ కంపెనీ లో…అదనపు శాలరీ..

Spread the love

టాట్‌ప్రూఫ్ అనే కంపెనీ అల్యూమినియం తయారుచేస్తుంది. టాట్‌ప్రూఫ్.. 2014 సోచీ వింటర్ ఒలింపిక్స్‌కి, 2018 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌కు అల్యూమియం సరఫరా చేసింది. ఈ కంపెనీ ‘ఫెమినినిటీ మారథాన్’ పేరిట గత నెల 27 నుంచి జూన్ 30 వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందంగా మేకప్ వేసుకొని, పొట్టి పొట్టి స్కర్టులు ధరించి ఆఫీసుకు వస్తే.. బోనస్ ఇస్తాం అని ప్రకటించిందా రష్యా కంపెనీ. అలా రావడమే కాదు.. ఆ ఫోటోలను కంపెనీకి సంబంధించిన ఫోన్ నంబరుకు వాట్సాప్ చేయాలట. అలా చేస్తే రోజుకు రూ.105 అదనంగా ఇస్తామని ప్రకటించింది.

🔴కంపెనీ కండిషన్ :

పనిచేసే చోట వెలుగులు నింపేందుకు ఈ రోజుల్లో మహిళలు స్కర్టులు ధరించి వస్తే, వాళ్లకు అదనపు జీతం ఇస్తాం అని పేర్కొంది. స్కర్టులు ఐదు అంగుళాలకు ఎక్కువ కాకుండా, మోకాళ్లు కనిపించేలా ఉండాలని షరతు విధించింది. 🔶సమర్దించుకుంటున్న టాట్‌ప్రూఫ్ కంపెనీ :

టాట్‌ప్రూఫ్ కంపెనీ కమ్యూనికేషన్స్ శాఖ ప్రతినిధి అనస్టాసియా కిరిలోవా మాట్లాడుతూ.. ఈ చర్య వల్ల కంపెనీలో పనిచేసే మహిళలు తమ చార్మింగ్‌ను ఫీల్ అయ్యేలా చేస్తుందని, వారికి మరింత అవగాహన పెరుగుతుందని వ్యాఖ్యానించారు.
🔴ఈ ప్రకటనపై నెటిజన్ల ఆగ్రహం :

నెటిజన్లు ఇవన్నీ మధ్యయుగం నాటి చర్యలని దుయ్యబట్టారు. పురుషులకు ఆనందం కలిగించేందుకు ఎందుకు స్కర్టులు వేసుకొని రావాలని ఓ మహిళ ప్రశ్నించింది.సదరు కంపెనీపై ఇంకా ఈ ప్రకటనపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. వెలుగుల పేరుతో చీకటి యుగంలోకి కొట్టుకుపోయేలా చేస్తోందని ఆ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading