Teluguwonders:
గణేశ్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా, విగ్రహాలు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ వివరించారు. ఇందుకోసం రోడ్ మ్యాప్‌ను రూ పొందించినట్లు తెలిపారు. ఈ నెల 12న నిమజ్జనం సందర్భం గా పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్లను ఏర్పాటు చేశామని, ఈ నెల 12న ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు. గణేశ్ విగ్రహాలను ఫ్లైఓవర్ల మీదుగా తీసుకెళ్లడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఫతేనగర్, సైబర్ టవర్స్, ఫోరం మాల్, గచ్చిబౌలి ఫ్లైఓవర్లపైకి గణేశ్ విగ్రహాలను అనుమతించమని చెప్పారు.
కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు ప్రాంతంలో…
ఐడీఎల్ ట్యాంక్ ఎంట్రెన్స్ నుంచి రెయిన్‌బో విస్త, టీ-జంక్షన్ వరకు జనరల్ ట్రాఫిక్‌ను అనుమతించరు. కూకట్‌పల్లి వై జంక్షన్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్ వెళ్లేవారు జేఎన్‌టీయూ నుంచి ఫోరం మాల్ రోడ్డు గుండా వెళ్లాలి. హైటెక్‌సిటీ, మాదాపూర్ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్ వైపు వెళ్లాలనుకునేవారు వయా కైతలాపూర్ రెయిన్‌బో విస్త, మూసాపేట రోడ్ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్‌కు వెళ్లాలి.
ప్రగతినగర్ టు జేఎన్‌టీయూ..
ప్రగతినగర్-జేఎన్‌టీయూ రోడ్డు గురువారం మూసివేస్తారు. (ప్రగతినగర్ కమాన్-శ్రీనివాస స్టీల్, ఆదిత్య నగర్ ఎక్స్ రోడ్డు వరకు..)
బౌరాంపేట నుంచి వచ్చే వాహనా లు ప్రగతినగర్ కమాన్ వద్ద డైవర్షన్ తీసుకొని బాచుపల్లి ఎక్స్‌రోడ్డు వైపు వెళ్లాలి.
జేఎన్‌టీయూ నుంచి వచ్చే వాహనదారులు శ్రీనివాస స్టీల్ ఆదిత్యనగర్ ఎక్స్‌రోడ్ నుంచి నిజాంపేట కోలం రాఘవరెడ్డి గార్డెన్ వైపు వెళ్లాలి.
సూరారం కట్టమైసమ్మ చెరువు..
బాలానగర్, జీడిమెట్ల నుంచి సూరారం చెరువు వద్దకు వెళ్లాల్సిన వాహనాలు బహదూర్‌పల్లి, బాచుపల్లి, గండిమైసమ్మ జంక్షన్ వద్ద డైవర్షన్ తీసుకొని సూరారం గ్రామం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, బౌరాంపేట ద్వారా సూరారం కట్టమైసమ్మ చెరువు వద్దకు వెళ్లాలి.
గండిమైసమ్మ, బాచుపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు జీడిమెట్ల, బాలానగర్ దగ్గర డైవర్షన్ తీసుకొని బహుదూర్‌పల్లి జంక్షన్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. దూలపల్లి గ్రామం టీ-జంక్షన్-ఐఏఎల్‌ఏ జీడిమెట్ల గుండా సూరారం కట్టమైసమ్మ చెరువుకు వెళ్లాలి
భారీ వాహనాలకు అనుమతిలేదు..
బీహెచ్‌ఈఎల్ ఎక్స్‌రోడ్డు, గోద్రేజ్ వై జంక్షన్, కూకట్‌పల్లి, బాలానగర్-ఫతేనగర్ బ్రిడ్జి, గోద్రేజ్-ఎర్రగడ్డ, ఫిరోజిగూడ-గోద్రేజ్ వై జంక్షన్, కూకట్‌పల్లి, గుడేన్‌మెట్-నర్సాపూర్ ఎక్స్‌రోడ్, పీవీఎన్‌ఆర్ ఫ్లైఓవర్-ఆరాంఘర్ ఎక్స్‌రోడ్డు వైపు భారీ వాహనాలు వెళ్లేందుకు అనుమతించరు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నగరంలోకి వెళ్లవచ్చు.
ఆల్వాల్ వైపు…
బోయిన్‌పల్లి, సికింద్రాబాద్ చుట్టుపక్కల కాలనీల నుంచి గణేశ్ విగ్రహాలతో వచ్చే వాహనాలు అంజయ్యనగర్ గుండా చెరువు వద్దకు చేరుకొని నిమజ్జనం అనంతరం ఖాళీ వాహనాలు ఓల్డ్ బోయినపల్లి, మాస్‌క్యూ రోడ్, హరిజన బస్తీ గుండా బయటకు వెళ్లాల్సి ఉంటుంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.