Latest

    అందర్నీ సృష్టించిన దేవుడిని ఎవరు సృష్టించారు..!!??

    మనుషుల్ని,భూమిపై ఉన్న ప్రతీ ప్రాణి ని దేవుడు సృష్టించారంటారు.అలాగే  దేవుణ్ణి ఎవరు సృష్టించారు అనేది ఒక విచిత్రమైన ప్రశ్న. దేవుని ఎవరు సృష్టించారు? దేవుడు ఎక్కడ నుండి వచ్చాడు? అంటే :

      ఆన్ని వస్తువులకు ఒక కారణం అవసరం అయితే,మరి దేవునికి కూడా ఒక కారణం కావాలనేది నాస్తికులు మరియు సంశయవాదుల యొక్క  వాదము. ఒకవేళ దేవునికి కారణం అవసరమైతే, దేవుడు దేవుడు కాదు అనేది వారి సమాధానం    “దేవుని ఎవరు సృష్టించారు?” అనేది మన సామాన్య ప్రశ్న కంటే కొంత క్లిష్టమైన ప్రశ్న. ఏమి కూడా శూన్యము నుండి రాదని అందరికి తెలుసు. కాబట్టి, దేవుడు “ఒకరు” అయిన యెడల, ఆయనకు కూడా ఒక కారణం ఉండాలి కదా?

    అసలు ఇది అర్థములేని ప్రశ్న అనేదే దీని జవాబు. ఉదాహరణ కి : “నీలిరంగు వాసన ఎలా ఉంటుంది?” అని అడిగినట్లు ఉంది ఇది. నీలిరంగు వాసన ఇచ్చే పదార్థం కాదు కాబట్టి, ఆ ప్రశ్నే సరికానిది. అదే విధంగా, దేవుడు కూడా సృష్టించబడిన వస్తువుల కోవలో లేడు. దేవుడు కారణము లేనివాడు మరియు సృష్టించబడనివాడు-ఆయన కేవలం ఉన్నాడు అంతే.

    ఇది మనకు ఎలా తెలుసు? ఎలా అంటే మనం గాలిని పీలుస్తాం.దాని వల్లే బతుకుతున్నామ్..అలాగని ఎవరైనా పీల్చే గాలిని చూపించమంటే ఎలా చూపిస్తాం.అలాగని చూపించకుంటే గాలి లేదని కాదు.అది ఒక అనుభూతి,ఒక నమ్మకం..   ఎల్లప్పుడూ ఉనికిలో ఉండియుండే దానినే మనం యదార్థం, నిజం అంటాం.  దేవుడు  కూడా ఎల్లప్పుడూ ఉండే ఒక యదార్థం.ఆయన ఆది అంతాలు లేని వాడు.

    🔅 భగవద్గీత లో శ్రీ కృష్ణుడు చెప్పింది కూడా అదే.  అన్ని మతాలు, మతగ్రంధాలు చెప్పేది ఒకటే దేవుడు అన్నిటిని సృష్టించినా తనను ఎవరూ సృష్టించలేని ఒక సృష్టికర్త అని.ఆయన కాలంతర్యామి.రూప కాలాలకు అతీతుడు…

    🔅దేవుడు ఒక భావన.. మనం అనుభవిస్తే చాలు..దేవుడు ఒక నమ్మకం.. నమ్మితే చాలు…


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading

    Subscribe