Gold Price Record: వామ్మో.. ఇక బంగారం కొనడం కష్టమే.. ఒకేసారి భారీగా పెరిగిన ధరలు.. తులంపై..

Gold Price Record: బంగారం ధరలు తగ్గుతాయని, తులం బంగారం ధర కేవలం రూ.55 వేలకు చేరుకోవచ్చని భావిస్తున్న తరుణంలో తాజాగా మరోసారి రికార్డ్‌ స్థాయిలో ఎగబాకింది. ప్రస్తుతం బంగారం ధర రికార్డ్ స్థాయిలో దూసుకుపోతోంది. తులం బంగారంపై ఏకంగా 3000 వరకు పెరిగి రికార్డ్‌ సృష్టించింది..

గత వారం రోజుల నుంచి క్రమంగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఇప్పుడు రికార్డ్‌ సృష్టించింది. ఏప్రిల్‌ 10న ఉదయం 6 గంటల సమయానికి స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. పది గంటల సమయానికి రికార్డ్‌ స్థాయిలో ఎగబాకింది. తులం బంగారంపై ఏకంగా రూ.2,940 వరకు పెరిగింది. ఇక వెండి విషయానికొస్తే కిలోపై రికార్డ్‌ స్థాయిలో పెరిగింది. కిలోపై ఏకంగా రూ.2000 వరకు పెరిగింది. ఉదయం 6 గంటల సమయానికి రూ.92,900 ఉండగా, అది 10 గంటల సమయానికి రూ.95,000 వరకు వెళ్లింది.

ప్రస్తుతం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,750కి చేరుకోగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,530 వద్దకు చేరింది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,380 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,600 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,380వద్ద కొనసాగుతోంది.

బంగారం ఒక ప్రధాన పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. వివాహాలు, పండుగలలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ఈ ధరలు మారుతూ ఉంటాయి. ప్రపంచ మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇందులో US ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వంటి పెద్ద కారణాలు ఉన్నాయి. గోల్డ్‌మన్ శాక్స్ ప్రకారం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సెంట్రల్ బ్యాంకుల ద్వారా బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇది రాబోయే కాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading