ఎవరైనా ఒకరికి ఒకరు స్నేహంగా ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా అధిగమించవచ్చు. ఏ.పీ సీఎం జగన్ , తెలంగాణ సీఎం కేసీఆర్ తో కొనసాగిస్తున్న స్నేహంతో అదే నిరూపిస్తున్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగాప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా, ముందు నుండీ ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం కేసీఆర్, నవ్యాంధ్ర సీఎం జగన్‌ల మధ్య స్నేహబంధం ఉంది. దీంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అనేక సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.ఈ దిశ లో
🔴 భద్రాచలం రాములోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిపోనున్నాడు:
తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం గ్రామాన్ని త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయబోతున్నట్టు సమాచారం. ఇదే విషయంపై ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు కూడా ప్రారంభమైనట్టు వినికిడి.
🔯దీనికి కేంద్రం పచ్చ జెండా : తెలంగాణలోని కొత్తగూడెం జిల్లాలో ఉన్న భద్రాచలం గ్రామాన్ని ఏపీలో విలీనం చేసే అంశంపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు విశ్వసనీయ సమాచారం. భద్రాద్రిని ఏపీలో కలిపే ప్రతిపాదనపై కేంద్ర సర్కార్ సైతం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో ఇటీవల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో భేటీ అయినప్పుడు విభజన సమస్యల పరిష్కారంపై చర్చ సందర్భంగా భద్రాచలం విలీనాంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అటు భద్రాద్రిని ఏపీలో కలిపేందుకు తెలంగాణ సీఎం సుముఖత వ్యక్తం చేశారని సమాచారం.
🔴జరగాల్సిన తతంగం: ఇదిలావుంటే భద్రాద్రిని ఆంధ్రప్రదేశ్‌లో కలపాలంటే పెద్ద తతంగమే జరగాల్సివుంది. రాష్ట్ర సరిహద్దులు మార్చాలంటే అసెంబ్లీ, పార్లమెంట్‌లో చట్ట సవరణ జరగాలి. ఆ తర్వాత రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీచేయాలి. అయితే ఇరు ప్రభుత్వాలు సుముఖంగా ఉంటే ఇది కష్టమేమి కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
🔴గతంలో ఏం జరిగింది :
గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాఫీగా సాగేందుకు ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఊరును మినహాయించి ఏడు మండలాలను ఎపిలో కలిపారు. కేవలం భావోద్వేగాల ప్రాతిపదికనే భద్రాచలం గ్రామాన్ని విలీనం నుంచి మినహాయించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
🔯ప్రస్తుతం భద్రాచలంవాసుల బాధ:
తెలంగాణ భూభాగంలో రాముడి దేవాలయం ఉండగా, గుడి మాన్యాలు ఎపిలో ఉన్నాయన్నది ఆ ప్రాంత వాసుల మాట. సెంటిమెంట్ రీత్యా భద్రాద్రి ఊరు మాత్రం తెలంగాణలో ఉంచి, చుట్టూ ఉన్న ప్రాంతమంతా ఎపిలో ఉండటంతో భద్రాచలం వాసులు ఇబ్బందులు పడుతున్నారన్నది సారాంశం. ఈ కారణాలతో పాటు పోలవరం ప్రాజెక్టు దీర్ఘకాల ప్రయోజనాల రీత్యా భద్రాద్రి గ్రామాన్ని ఎపిలో కలపడమే కరెక్టు అనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.భద్రాద్రి రాముడు మన రాష్ట్రం లోకి వస్తే మన అదృష్టమే.కానీ.
🔴రాబోయేసమస్యలు: ఒకప్పుడు ఏడు మండలాలను ఏపీలో కలపడంపై అప్పట్లో తెలంగాణ ఉద్యమ సంఘాలు, తెరాస పార్టీలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరి ఇప్పుడు భద్రాద్రి గ్రామాన్ని కూడా ఏపీలో కలిపితే ప్రజలు నుంచి ఆందోళనలు తలెత్తే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా సున్నితమైన ఈ అంశాన్ని పరిష్కరించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కసరత్తు చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం ఈ అంశం ఎంత వరకూ దారి తీస్తుందో..
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.