జగన్ ఆసావర్కర్లు జీతాన్ని భారీగా పెంచారు.జీతాలు పెంచడం వలన అవినీతి తగ్గుతుందని జగన్ అభిప్రాయం అని కొంత మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. .సీ.ఎం గా జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుండి వరసగా ప్రజలకు ఉపయోగపడే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంచలనం సృష్టిస్తున్నారు.
🔴విషయం లోకి వెళ్తే : మొన్న ముఖ్యమంత్రి పేషీలో పనిచేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి సంచలన నిర్ణయం తీసుకున్న జగన్.. ఇప్పుడు వైద్య శాఖపై దృష్టి పెట్టారు.
🎊ఆశా వర్కర్స్ జీవితాల్లో వెలుగులు :ఇక ఆశా వర్కర్ల జీతాల విషయంలో జగన్ ఓ కీలక నిర్ణయం తీసుకొని సంచలనం సృష్టించాడు. నెలకు కేవలం 3వేల రూపాయలు జీతంగా తీసుకుంటున్న ఆశా వర్కర్ల జీతం 10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటించారు.
ఇది ఆశా వర్కర్లకు తీపి కబురే అని చెప్పాలి. చాలీ చాలని జీతంతో పనిచేసే వర్కర్లకు 7 వేలు అదనంగా వస్తుంది అంటే ఎంతగా పనిచేస్తారో చెప్పక్కర్లేదు. వారి జీవితం బాగుపడుతుంది. పనితీరు మెరుగుపడుతుంది.
👉విశాఖ ఆరోగ్య కేంద్ర సందర్శన : విశాఖలో ఆయన వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ పథకం పేరు మార్చి.. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ గా నామకరణం చేశారు. వైఎస్ హాయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శ్రీ పధకం ప్రజలను ఎంత ప్రభావితం చేసిందో చెప్పక్కర్లేదు. అందుకే ఆరోగ్యశ్రీ కి సంబంధించిన శాఖను తనవద్దే ఉంచుకుంటున్నట్టు జగన్ తెలిపారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.