మీ కంపెనీలో కూడా ఇలానే నాలుగు రోజులు పనిదినాలు ఉండి.. మూడు రోజులు వీకాఫ్ ఉండాలని భావిస్తున్నారా? అయితే మీ బాస్ తో కూడా ఈ విషయం పై చర్చించండి. ఎందుకంటే ఈ వారానికి నాలుగు రోజుల డ్యూటీ అనేది మన వద్ద కాదు వేరే చోట . 👉సాధారణం గా వారానికి ఆరు రోజులు డ్యూటీ.. ఒకరోజు వీకాఫ్.. మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లాలంటే ఎంతో బోరుగా ఫీల్ అవుతారు. వారం అంతా ఆఫీసుల్లో పనిచేయడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతారు. వారంలో ఒకరోజు వీకాఫ్ తీసుకున్నప్పటికీ.. ఆ రోజుంతా రెస్ట్ తీసుకోవాడానికే సరిపోదు. దీంతో మానసిక ఒత్తిడికి గురవుతుంటారు.
🎉కొన్ని కంపెనీల్లో వారానికి 5 రోజులే పని : . .కొన్ని చోట్ల వారానికి ఐదురోజులే పని.. రెండు రోజులు వీకాఫ్ ఉంటుంది. తమ కంపెనీలో కూడా వారంలో రెండు లేదా మూడు రోజులు వీకాఫ్ ఉంటే ఎంతో బాగుండు అని చాలామంది ఉద్యోగులు అనుకుంటారు. అలా భావించే ఉద్యోగులకు వారి కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇకపై వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని ప్రకటించింది.
అంతే.. ఆ కంపెనీ ఉద్యోగుల్లో పట్టరాని ఆనందం.. ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా పనిచేసుకుంటున్నారు.
🔴ఇంతకి ఆ ఆఫీస్ ఎక్కడంటే : లండన్ లోని పాలీమౌత్, పోర్ట్ క్యూల్లీస్ లీగల్స్ అనే ప్రైవేటు కంపెనీలో. ఈ కంపెనీ బాస్.. తమ వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేయండి.. ఎలాంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా వర్క్ చేసుకోండని స్టాప్ తో చెప్పాడు. నాలుగు రోజుల పనివిధానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు కంపెనీ.. ఐదు నెలల పాటు ఇదే షెడ్యూల్ ఫాలో అయింది. ఆ తర్వాత 4 రోజుల వర్కింగ్ పాలసీని పర్మినెంట్ గా అమల్లోకి తీసుకొచ్చారు.
ఈ కొత్త విధానంపై సంస్థ ఉద్యోగి మాట్లాడుతూ.. నాలుగు రోజుల పని విధానంతో ఉద్యోగులంతా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని, ఎలాంటి పని ఒత్తిడి ఉన్నట్టుగా అనిపించడమే లేదని సంతోషం వ్యక్తం చేశాడు. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తేనే.. సంస్థ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.