ఎవరో కాల్చి పడేసిన పొగాకును ఒక ముష్టివాడు కాగితంలో చుట్టుకుని కాల్చితే అది చూసిన బ్రిటిష్ వాళ్ళు దాన్ని సిగరెట్ గా తీసుకువచ్చారట.పోలిక సమంజసం గా ఉన్నా లేకపోయినా ఒక్కోసారి చిన్న చిన్న విషయాలు గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ కి కారణం అవుతుంటాయి. కొంతకాలం తర్వాత ఆ ఆవిష్కరణకు కారణం అసలు కారణం ఇదా అని తెలిసి ఆశ్చర్యపోతూ ఉంటాం .ఇది అందరు అంగీకరించవలసిన విషయమే. ఎన్నోసార్లు రుజువుకాబడింది కూడా. 👉విషయం ఏమంటే.. ఇప్పుడంటే గూగుల్ లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది.20 ఏళ్ల క్రితం చూసుకుంటే ఏ సమాచారం కావాలన్నా.. ఏ ఫోటో కావాలన్నా పేపర్లో వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఫోటోల కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేవారు.
గూగుల్ ఆవిష్కరణ తరువాత ప్రపంచం మొత్తం మారిపోయింది.
🔴గూగుల్ ఇమేజెస్ ఆవిష్కరణ :2000 సంవత్సరంలో గూగుల్ సంస్థ గూగుల్ ఇమేజెస్ అను ఆప్షన్ ను తీసుకొచ్చింది. అప్పటి నుంచి లక్షలాది ఇమేజెస్ ను గూగుల్ అందుబాటులో ఉంచుతోంది. అయితే, గూగుల్ ఇమేజెస్ ఆప్షన్ ను తీసుకురావడానికి ఓ కారణం ఓ హీరోయిన్ అట.
🔹జెన్నిఫర్ లోపెజ్ :హాలీవుడ్ హీరోయిన్ జెన్నిఫర్ లోపెజ్ 2000 లో గ్రామీ వేడుకల్లో పాల్గొనేందుకు హాజరైంది. ఆ ఏడాది ఆమెకు ఎలాంటి అవార్డు రాలేదు. అవార్డును బహుకరించేందుకు ఆమె ఆ వేడుకకు హాజరైంది. ఆ వేడుక కోసం జెన్నీ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చింది. అందుబాటులో మంచి డ్రెస్ ఏది లేకపోవడంతో… ఉల్లిపొరలాంటి డ్రెస్ వేసుకొని వచ్చిందట. ఆ డ్రెస్ లో జెన్నీని చూసేందుకు రెండు కళ్ళు చాలలేదు. ఆ ఫోటో కోసం అప్పటి యువత గూగుల్ లో తెగ సెర్చ్ చేశారట. దీంతో గూగుల్ కు గూగుల్ ఇమేజెస్ కావాలనే ఆలోచన వచ్చి ఇమేజెస్ ఆప్షన్ ను ఇన్సర్ట్ చేశారు.
👉గూగుల్ ఇమేజెస్ చీఫ్ ఇన్వెన్షన్ ఆఫీసర్ గా :గూగుల్ ఇమేజెస్ ఐడియా రావడానికి కారణమైన జెన్నీకి గూగుల్ ఇమేజెస్ చీఫ్ ఇన్వెన్షన్ ఆఫీసర్ పదవిని ఇచ్చిందట గూగుల్. సో జెన్నిఫర్ రుణం గూగుల్ బాగానే తీర్చుకుందన మాట.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.