హెల్మెట్ లేదా అయితే పెట్రోల్ లేదు-హెల్మెట్ వాడుతున్నారా అయితే లీటర్ పెట్రోల్ free.. ఏంటిది విచిత్రం గా అనుకుంటున్నారా..ఈ ఆఫర్స్ రెండూ ఒక చోట కాదు లేండి..ఒకటి దేశ రాజధాని లో అయితే మరొకటి ప్రక్కనున్న చెన్నై..రాష్టం లో
🔴హెల్మెట్ లేకపోతే పెట్రోల్ నై.. : న్యూఢిల్లీ లో ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా కొత్త నిబంధనలు గ్రేటర్ నోయిడా పరిధిలో అమల్లోకి వచ్చాయి. హెల్మెట్ లేకుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు ఇకపై పెట్రోల్ లభించదు. నోయిడా, గ్రేటర్ నోయిడాలో పరిధిలోని బైక్ రైడర్స్ హెల్మెట్ లేకుండా పెట్రోల్ స్టేషన్కు వెళితే అక్కడి సిబ్బంది పెట్రోల్ పోయరు. ఈ నిబంధన జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి.ఇక
🔴హెల్మెట్ ధరించిన వారికి లీటర్ పెట్రోలు : తమిళనాడులోని తిరుచెందూరులో ప్రమాదాల నివారణపై అవగాహన ప్రచారం కల్పించడంలో భాగంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడిపిన వారికి లీటర్ పెట్రోలును పోలీసుల ద్వారా పెట్రోలు బంక్ల యజమానుల సంఘం నిర్వాహకులు కలిసి ఉచితంగా అందించారు. తిరుచెందూరులోని 13 పెట్రోల్ బంక్లలో శుక్రవారం ‘సంతోష సమయం’ అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆ మేరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా హెల్మెట్లు ధరించిన వాహనచోదకుల బైకులు, స్కూటర్లు, మోపెడ్లను పెట్రోలు బంక్ల వద్దకు తీసుకెళ్లి ఒక లీటర్ పెట్రోలును ఉచితంగా పోసి పంపారు. ఈ కార్యక్రమానికి తిరుచెందూరు డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ భారత్ ప్రారంభించారు. హెల్మెట్లు ధరించిన వాహనచోధకులు 30 మందికి లీటరు పెట్రోలును ఉచితంగా అందిం చారు. అదే సమయంలో హెల్మె ట్లు ధరించని వాహన చోద కులు లీటరు పెట్రోలును ఉచి తంగా పొందలేక పోయామని నిరాశ చెందారు. పెట్రోలు బంక్ల యజమానుల సంఘం నిర్వాహకులు మాట్లాడుతూ హెల్మెట్ధారణపై అవగాహన ప్రచారం కల్పించే నిమిత్తం ప్రతి నెలా హెల్మెట్లు ధరించి ద్విచక్రవాహనాలు నడిపే వారికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు లీటర్ పెట్రోలును ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.