హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడగింపు

High Court jobs application deadline
Spread the love

Teluguwonders:

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జిల్లాల వారీగా సబార్డినేట్ కోర్టుల్లో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును పొడగించింది. సెప్టెంబరు 18 వరకు పొడిగిస్తున్నట్లు ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. వాస్తవానికి దరఖాస్తు గడువు సెప్టెంబరు 4తో ముగియాలి.. కానీ మరో రెండువారాల పాటు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, బీసీ అభ్యర్థులు రూ.800; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఖాళీల వివరాలు…

✪ మొత్తం పోస్టుల సంఖ్య: 1,539 జిల్లాల వారీగా ఖాళీలు..

జిల్లా పోస్టులు:

అదిలాబాద్-68, ఖమ్మం-205, కరీంనగర్-200, మహబూబ్‌నగర్-174, మెదక్-116, నిజామాబాద్-127, నల్గొండ-209, వరంగల్-87, హైదరాబాద్-178, రంగారెడ్డి-175, మొత్తం ఖాళీలు-1,539.

పోస్టుల వివరాలు.. పోస్టుల: పోస్టుల సంఖ్య విద్యార్హత: స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 54 ఏదైనా డిగ్రీ: జూనియర్ అసిస్టెంట్ 277 ఇంటర్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. టైపిస్టు 146 ఇంటర్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

ఫీల్డ్ అసిస్టెంట్-65 ఇంటర్, ఎగ్జామినర్-57 ఇంటర్, కాపియిస్ట్-122 ఇంటర్, రికార్డ్ అసిస్టెంట్-05 ఇంటర్, ప్రాసెస్ సర్వర్-127 పదోతరగతి, ఆఫీస్ సబార్టినేట్-686 7వ తరగతి. మొత్తం పోస్టులు-1,539 -వయోపరిమితి: 01.07.2019 నాటికి 18-34 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ కంప్యూటర్ బేస్డ్‌ టెస్ట్, స్కిల్ టెస్ట్, వైవా వాయిస్ ద్వారా. ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులు రూ.800; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. ముఖ్యమైన తేదీలు: ✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.08.2019. ✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.09.2019. (18.09.2019 వరకు పొడిగించారు).


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading