Latest

    హిట్ 3 మూవీ రివ్యూ.. నాని ఊర మాస్ యాంగిల్.. క్లైమాక్స్ వేరేలెవల్..

    నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ హిట్ 3. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి హిట్ 3 ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందా..? నాని మరోసారి నిర్మాతగా సక్సెస్ అయ్యాడా..? హీరోగా ఏం చేసాడు అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

    మూవీ రివ్యూ: హిట్ 3

    నటీనటులు: నాని, శ్రీనిథి శెట్టి, రావు రమేష్, సూర్య శ్రీనివాస్, శ్రీనాథ్ మాగంటి, బ్రహ్మాజీ తదితరులు

    సంగీతం: మిక్కీ జే మేయర్

    సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గేసే

    ఎడిటర్: కార్తిక శ్రీనివాస్

    నిర్మాత: నాని, ప్రశాంతి త్రిపురనేని

    కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: డా. శైలేష్ కొలను

    నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ హిట్ 3. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి హిట్ 3 ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందా..? నాని మరోసారి నిర్మాతగా సక్సెస్ అయ్యాడా..? హీరోగా ఏం చేసాడు అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

    కథ:

    అర్జున్ సర్కార్ (నాని) రూత్ లెస్ కాప్. 100 మంది అమాయకులు చచ్చినా పర్లేదు గానీ ఒక్క క్రిమినల్ మాత్రం బతక్కూడదు అనుకునే మనిషి. తన చేతికి దొరికిన క్రిమినల్స్‌కు నరకం చూపిస్తుంటాడు అర్జున్. అలాంటి క్రేజీ కాప్ చేతికి ఓ సైకో కిల్లర్ వస్తుంది. వరుసగా హత్యలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతుంటాడు. అలాంటి కేసులోకి అర్జున్ సర్కార్ వస్తాడు. వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి.. ఆ తర్వాత తన లాఠీకి పని చెప్తాడు. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు.. అతడి మోటో ఏంటి.. ఎందుకిలా హత్యలు చేస్తున్నాడు అనేది మిగిలిన కథ..

    కథనం:

    సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో ఫ్రాంచైజీలు తక్కువే.. మన దగ్గర అంత మల్టీవర్స్ ఇంకా రాలేదు. కానీ దాన్నిప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నాడు నాని. తన హిట్ ఫ్రాంచైజీని ఆడియన్స్‌కు అలవాటు చేస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్‌లో వచ్చిన థర్డ్ కేస్ హిట్ 3. ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. పైగా ట్రైలర్ కూడా అదిరిపోవడం.. యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా నెక్ట్స్ లెవల్‌లో ఉండటంతో హిట్ 3 కోసం ఆసక్తిగా వేచి చూసారు ఆడియన్స్. వాళ్ల అంచనాలకు తగ్గట్లుగానే హిట్ 3 తెరకెక్కించాడు దర్శకుడు శైలేష్. ఫస్ట్ సీన్ నుంచే ఎక్కడా టైమ్ వేస్ట్ చేయకుండా కథ మొదలు పెట్టాడు. అర్జున్ సర్కార్ ఇంట్రో నుంచే మనోడి క్యారెక్టరైజేషన్ పక్కాగా ఎస్టిబ్లిష్ చేసాడు శైలేష్. క్రిమినల్స్‌తో ఆయన ఉండే తీరు చూస్తుంటే వణుకు వస్తుంది. అంత కిరాతకంగా ఉంటాడు అర్జున్ సర్కార్. అలాంటి పోలీస్ ఆఫీసర్ చేతికి సైకో కేసు వచ్చిన తర్వాత స్పీడ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో చాగంటి ప్రవచనాలు భలే వాడుకున్నాడు దర్శకుడు శైలేష్. హీరో చేస్తున్న పనులను ఆయన ప్రవచనాలకు ముడిపెట్టిన తీరు బాగుంది. ఫస్టాఫ్ అంతా సైకో చేసే హత్యలు.. ఇన్వెస్టిగేషన్ తో వెళ్లిపోతుంది. చిన్నపిల్ల ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. ఎమోషనల్‌గానూ ఈ సీన్ చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు శైలేష్. అక్కడక్కడా ఒళ్ళు గగ్గురుపొడిచే సీన్స్ కూడా ఉంటాయి.

    ఓ వైపు సీరియస్ ట్రాక్ నడుస్తున్నపుడే.. మధ్య మధ్యలో నాని, శ్రీనిథి మధ్య సీన్స్ రాసుకున్నాడు శైలేష్. అవి కాస్త రీ ఫ్రెషింగ్‌గా అనిపిస్తాయి. ఇక సెకండాఫ్ అంతా ట్విస్టులు, టర్నులతో వెళ్లిపోయింది. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు అయితే నెక్ట్స్ లెవల్. హిట్ 1, 2 కేసులతో ఈ సినిమాను ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంటుంది. అదేంటో స్క్రీన్ మీదే చూడాలి. ముందు నుంచి టీజర్, ట్రైలర్‌లో హైలైట్ చేసిన కోట్ సీన్స్ అయితే అదిరిపోయాయి. సైకోను పట్టుకునే సీన్స్ అన్నీ చాలా అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా ట్విస్టులు అలరిస్తాయి. సింపుల్ కథనే చాలా మలుపులు ఉండేలా రాసుకున్నాడు దర్శకుడు శైలేష్. క్లైమాక్స్‌లో నాని యాక్షన్ సీక్వెన్సులు చూస్తే భయమేస్తుంది. వామ్మో ఏంటిది ఇంత క్రూయల్‌గా ఉన్నాడు అనిపిస్తుంది. ఇన్నాళ్లూ మనం చూసిన నాని ఇతడేనా అనిపించేలా రెచ్చిపోయాడు నాని. అందుకే మధ్యలో ఓ డైలాగ్ కూడా పెట్టాడు.. ఇన్నాళ్లూ అదే అనుకుని మోసపోయారు జనం.. నేను చూపిస్తా ఒరిజినల్ అని..! దానికి తగ్గట్లుగానే ఉంటుంది హిట్ 3లో నాని క్యారెక్టరైజేషన్. పిల్లలకు పొరపాటున కూడా ఎంట్రీ లేదు.. వచ్చారా వణికిపోతారు.

     

    పంచ్ లైన్:

    ఓవరాల్‌గా హిట్ 3.. అబ్‌కీ బార్ అర్జున్ సర్కార్..!


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading