చాలా మంది డబ్బు సంపాదిస్తారు. కానీ డబ్బును ఎలా దాచుకోవాలో మాత్రం ఎవరికీ తెలియదు. మన లో ఆదాయానికి మించి ఖర్చు చేసేవాళ్లు చాలామందే ఉంటారు. వారు ఈ చిట్కాలు ఫాలో అయితే చాలు
🔴బడ్జెట్ రాయండి:
మీ రోజు వారి ఖర్చుల్లో దేన్ని వదిలిపెట్టకుండా రాసుకోండి. మీరు తాగిన కాఫీ, తిన్న టిఫిన్ ఖర్చులను కూడా నోట్ చేయండి. అలాగే జిమ్, షాపింగ్, రెంట్, ఎంటర్ టైన్ మెంట్ కోసం మీరు పెట్టే ఖర్చులన్నింటినీ రాసి పెట్టుకోండి. ఇలా చేస్తే మీరు దేనికోసం ఎంత ఖర్చుపెడుతున్నారో తెలిసిపోతుంది.
డబ్బును ఆదా చేసే విషయంలో మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. లేదంటే మీరు సంపాదించేదానికంటే ఎక్కువ ఖర్చు చేసి అప్పులపాలవుతారు. కొన్నేళ్ల తర్వాత లెక్కలేసుకుంటే ఏమీ మిగలదు. అందుకే సేవింగ్స్ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి.
డబ్బు సంపాదించడంతో పాటు దాన్ని దాచుపెట్టుకునేవిషయంలో కూడా కొన్ని లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి. మీ సంపాదన బట్టీ ప్రతి నెల కొంత మేర అమౌంట్ కచ్చితంగా సేవ్ చేయాలని నిర్ణయించుకోండి. ఆ మేరకు డబ్బు దాచుకుంటూ ఉండండి.
👉అధిక వడ్డీ లభించే వాటిపై పెట్టుబడి :
డబ్బు దాచుకోవడంలో కొన్ని రకాల చిట్కాలు పాటించాలి. మీ సేవింగ్ ఖాతాలో డబ్బులు ఉంచడం వల్ల పెద్దగా వడ్డీ రాదు. అందువల్ల కాస్త అధిక వడ్డీ లభించే వాటిపై పెట్టుబడి పెట్టాలి. మ్యూచ్ వల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్స్ , స్టార్ట్ అప్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలి. అయితే వీటిలో పెట్టుబడి పెట్టే ముందు కూడా ఒకటికిపదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
ఆదాయానికి మించి ఖర్చులు చేస్తే మీరు భవిష్యత్తుల్లో అస్సలు డబ్బు సంపాదించలేరు. ఒక ప్రణాళిక లేకుండా ఎలా అంటే ఆలాడబ్బును ఖర్చు చేయకండి. 🔹నో వీకెండ్ పార్టీస్ :
చాలా మంది ఫ్రెండ్స్ తో వీకెండ్స్ లో బయటకు వెళ్తూ చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఎంజాయ్ చేయొచ్చుగానీ బయట మీరు ప్రతి దానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక వాటర్ బాటిల్ కొనుకున్నా… కూల్ డ్రింక్ బాటిల్ కొనుకున్నా సరే అదనపు ధరలు చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల మీరు ఇంట్లోనే పార్టీలు అరేంజ్ చేసుకోండి. 👉ఫ్రెండ్స్ మీరు ఇక ఈ చిట్కాలను వాడి బోలెడంత డబ్బును సేవ్ చేసుకోండి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.