Teluguwonders:
జబర్ధస్త్ కామెడీ షోతో స్టార్ కమెడియన్ స్టేటస్ అందుకున్నాడు హైపర్ ఆది. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక జబర్ధస్త్‌లో పాపులర్ అయిన హైపర్ ది.. అదే ఊపుతో సినిమాల్లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ హైపర్ ఆది పంచ్‌లు మాత్రం పేలలేదు. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పి ..తనకు అచ్చొచ్చిన జబర్ధస్త్ షోనే నమ్ముకున్నాడు. ఒక్క హైపర్ ఆది మాత్రమే కాదు.. జబర్దస్త్ కమెడియన్లకు సినిమాలు అంతగా కలిసి రాలేదు. కానీ ఈ వారం ఎపిసోడ్‌లో హైపర్ ఆది స్కిట్ లేకపోవడంతో జబర్దస్త్ షో చూసే ప్రేక్షకులు ఒకింత నిరాత్సాహానికి గురైనట్టు సోషల్ మీడియా వేదికల్లో గట్టిగానే ప్రచారం జరగుతోంది. ఐతే.. జబర్ధస్త్ షోకు హైపర్ ఆది రాకపోవడానికి కారణం..ఆయనకు అతని టీమ్ మెంబర్స్ అమెరికా సహా పలు దేశాల్లో తెలుగు వాళ్లున్న చోట ప్రత్యేకంగా కొన్ని స్కిట్స్ చేయడానికి వెళ్లినట్టు సమాచారం.
మరోవైపు హైపర్ ఆదికి మరలా సినీ అవకాశాలు తలుపు తట్టినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక హైపర్ ఆది స్వతహాగా రైటర్ కాబట్టి.. వేరే దర్శకులకు, రచయితలకు కామెడీ టైమింగ్‌లో సలహాలు సూచనలు కూడా చేస్తున్నట్టు సమాచారం. ఏమైనా ఉప్పు లేని పప్పు.. మసాలా లేని కూరలా ఇపుడు హైపర్ ఆది స్కిట్ లేని జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు కిక్కే రావడం లేదని అభిమానులు అంటున్నారు. గతంలో కూడా హైపర్ ఆది.. కొన్ని రోజులు జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు తాత్కాలింగా బ్రేక్ ఇచ్చాడు. ఏమైనా హైపర్ ఆది తొందర్లనే జబర్ధస్త్ షోకు వస్తే చూడాలనుకునే అభిమానులు చాలా మందే ఉన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.