ముచ్చటగా మూడోసారి పాకిస్థాన్‌ పై భారత్‌ ఘన విజయం

Spread the love

Telugu wonders:

🔸పాకిస్థాన్‌ పై భారత్‌ ఘన విజయం

🔸రోహిత్‌ శర్మ కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

🔸వరల్డ్ కప్ లో వరుసగా టీమిండియాకి.. మూడో విజయం.

ఆదివారం జరిగినప్రపంచకప్‌లో దాయాది జట్టును 89 పరుగుల తేడాతో భారత్‌ చిత్తుగా ఓడించి పాకిస్థాన్‌ పై అద్వితీయ విజయం సాధించింది. ప్రపంచ కప్‌లోపాకిస్థాన్‌పై భారత్‌కు ఇది ఏడో విజయాన్ని నమోదు చేసింది.

🌟మెరుపులు ఇలా మొదలయ్యాయి :
టాస్ ఓడి ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన భారత్ 50 ఓవర్లలో 336 పరుగులు చేసింది. 👉ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 140 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ కు తోడుగా కెప్టెన్‌ కోహ్లీ 77, రాహుల్‌ 57 పరుగులు చేయడంతో భారత్‌ పాక్‌ ముందు భారీ టార్గెట్‌ ను నిర్దేశించింది. వర్షం పలు మార్లు అంతరాయం కలిగించడంతో పాక్‌ లక్ష్యాన్ని 40 ఓవర్లకు 302గా నిర్ణయించారు.

🔴వికెట్స్ ఎత్తేసిన టీమిండియా బౌలర్లు :                                                        విజయ్‌ శంకర్‌, హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌ తలో రెండు వికెట్లతో తీయడంతో పాక్‌ ఆరు వికెట్ల నష్టానికి 212 పరుగులే చేసింది.

🔸రోహిత్‌ శర్మ..దూకుడు :

భారత ఇన్నింగ్‌లో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ.. కీలకపాత్ర పోషించాడు. కేఎల్‌ రాహుల్‌ తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన రోహిత్‌ ఆరంభం నుంచే పాక్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును దూకుడు గా పరుగులు పెట్టించాడు. 57 పరుగులతో రాహుల్‌ అవుటైన తర్వాత …

🌟రోహిత్@140 పరుగులు :

కోహ్లీతో కలిసి రోహిత్‌ ఇన్నింగ్‌ను నిలబెట్టాడు. కేవలం 85 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తర్వాత కూడా దూకుడుగా ఆడిన రోహిత్‌‌ 140 పరుగుల వద్ద వెనుదిరిగాడు. వీరికి తోడు.. 👉కోహ్లీ 77 పరుగులు, హార్ధిక్‌ పాండ్య 26 పరుగులు చేయడంతో భారత్‌ 50 ఓవర్లలో 336 పరుగులు చేసింది.

🎯లక్ష్యం 337 పరుగులు :
337 పరుగుల లక్ష్య ఛేదనలో ఏ దశలోనూ పాకిస్థాన్‌ న్నీ భారత్‌ గెలిచే అవకాశాన్ని కలిపించలేదు.

🔵పాక్ ఆట తీరు : మొదటి ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ విజయ్ శంకర్‌ బౌలింగ్‌లో ఓడిపోయినా .. రెండో వికెట్ కు పాక్‌ వందకు పైగా పరుగులు జోడించడం విశేషం గా నిలిచింది. ఒక దశలో..భారత్ విజయం పై అనుమానం కూడా వచ్చింది. ప్రమాదకరమైన ఫకర్‌ జమాన్‌, బాబర్‌ అజామ్‌ల జోడిని కుల్‌ దీప్‌ విడదీసి, బాబర్‌ అజామ్‌, ఫకర్ జమాన్‌ ను వెంట వెంటనే అవుట్‌ చేసి భారత్ ను తిరిగి ట్రాక్ లోకి తీసుకురావడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు . అయితే 👉దీనికి తోడు గట్టెక్కిస్తారనుకున్న ఆటగాళ్లు హాఫీజ్‌, షోయబ్‌ మాలిక్‌ కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో.. పాక్‌ పూర్తిగా కష్టాల్లో పడిపోయింది. కెప్టెన్‌ సర్ఫరాజ్‌ వీరోచితంగా కొద్ది సేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.

🔴ఈ దశలో వర్షం పడింది : దాంతో మ్యాచ్‌ ను డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం.. 40 ఓవర్లకు కుదించారు.

👉చివరిగా: విజయానికి 302 పరుగులు చేయాల్సిన పాకిస్తాన్ 212 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయి.. 86 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.

🔴వరల్డ్‌ కప్‌ లో వరుసగా టీమిండియా మూడో విజయం :

🌟దక్షిణాఫ్రికాతో తొలి విజయపు బోణీ : 5.6.2019 బుధవారం నాడు ఇంగ్లాండ్ లోని సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా పై విజయం సాధించి వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా బోణీ చేసింది.

🌟 ఆస్ట్రేలియాతో రెండో విజయం : ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం 9.6.2019 న కెన్నింగ్టన్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రికార్డు విజయాన్ని టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 352 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా, లక్ష్య ఛేదనలో ఆసీస్ 316 పరుగులకే ఆలౌట్ అయ్యి 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టు ఆస్ట్రేలియా పది వరుస విజయాలకు బ్రేక్ వేసినట్లైంది. అలాగే వన్డేల్లే ఆస్ట్రేలియాపై 50 విజయాలు సాధించిన మూడో జట్టుగా కూడా టీమిండియా రికార్డు సాధించింది. ఈ విజయంతో వరల్డ్‌ కప్‌ లో వరుసగా టీమిండియా మూడో విజయాన్ని దక్కించుకున్నది.

🔸మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ : ఈ మ్యాచ్ లో..రోహిత్‌ శర్మ కు “మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ “అవార్డ్‌ దక్కడం విశేషం.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading