Teluguwonders:
సాధారణంగా మనం పెద్దలను గాని గొప్పవారిని గాని కనపడినప్పుడు తలవంచి చేతితో ఒక సంజ్ఞ చేయడం ద్వారా వారిని గౌరవిస్తాము .దీన్ని నమస్కారం అంటాము. హిందూ సంప్రదాయంలో లో ఇది ఒకగొప్పఅలవాటు.
🙏నమస్తే : నమస్తే, నమస్కారం లేదా నమస్కార్ అనే ఈ పదము నమస్సు నుండి ఉద్భవించింది. నమస్సు లేదా ” నమః ” అనగా “మనిషిలో గల ఆత్మ”ను గౌరవించుట( లేదా)నమస్తే’ అనే పదం ‘నమరి’, ‘తే’ అన్న వాటిని కలపడం
ద్వారా వచ్చింది. “నమరి” అన్నదానికి అర్ధం శిరస్సు వంచడం. ‘తే’ అంటే “మీకు’ అని అర్థం. ఈ సంప్రదాయము భారతదేశంతో పాటు దక్షిణాసియాలో ఎక్కువగా వాడుకలో ఉంది. ప్రత్యేకంగా హిందూ, జైన మరియు బౌద్ధ మతావలంబీకులలో సాధారణంగా కానవస్తుంది. ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించు అతి చక్కని ముద్రగా నమస్కారము పరిగణింపబడుతుంది.
గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, తమ భక్తిని ప్రకటించుకొనే ప్రక్రియ ఇది.
🕉సంప్రదాయం : భారతీయ సంస్కృతిలో తల్లి దండ్రులను, ఉపాధ్యాయులను పెద్ద వారి నందరిని గౌరవించుటకు శిరస్సు వంచి నమస్కరించటం ఒక సంసారముగా భావిస్తారు. నిజానికి ఇద్దరు వ్యక్తులు కలిసి ‘నమస్తే అని ఒకరి కొకరు పలుకరించుకోవడమంటే వారి వారి మనస్సులు కలసినవని సూచించుకోవడమన్న మాట. ఛాతీముందు చేతులు జోడించడం దీన్నే సూచిస్తుంది. తలవంచడమంటే స్నేహాన్ని ప్రేమానురాగాల రూపంలో వినమ్రంగా అందించడం.
ఇదే మాదిరి నమస్కరించి ‘జై శ్రీరాం’ ‘రాంరాం’,
‘జై శ్రీకృష్ణ’, ‘నమో నారాయణ’, ‘జై సాయిరాం’, వంటి మాటలను కూడా దైవత్వ గుర్తింపుగా అంటూ ఒకరి నొకరు పలకరించు కోవడం, వీడ్కోలు చెప్పుకోవడం అనేది ఆనవాయితీగా వుంది.
✡ఆధ్యాత్మిక అర్థం : ‘నమస్తే’ అన్న మాటకు ఆధ్యాత్మిక అర్థం జీవనశక్తి, దైవత్వం, నమస్కారము అనెడి సుగుణము సంస్కారుల కలబోత. నమస్కారము జీవితంలో ఆనందమును నింపుతుంది. అజ్ఞానమును అంతం చేస్తుంది , అహంకారమును.
తగ్గిస్తుంది, అభిమానమును అంతం చేస్తుంది.
👉అంజలి నమస్కారం :
ఇది సర్వసాధారణమైన రెండుచేతులను కలిపి 🙏ఇలా నమస్కారం అనటం.
👉సాష్టాంగ నమస్కారం :
మనస్సు, బుద్ధి, అభిమానం, రెండు పాదాలు, రెండు చేతులు, శిరస్సు అను ఈ ఎనిమిదింటితో చేయు నమస్కారమే సాష్టాంగ నమస్కారం. ఇందులో ఒక వ్యక్తి యొక్క శరీరంలోని అష్ట భాగాలు భూమిని తాకుతూ బోర్లా పడుకొనే మాదిరిగా దేవునికి ఎదురుగా పడుకొని నమస్కారం చేస్తారు.ఇది స్త్రీలు చేయకూడదు
👉దండ ప్రణామం (లేదా)దండాలు :
నేలమీద పడిన దండము (కర్రలాగా) శరీరాన్ని భూమిపైవాల్చి పరుండి కాళ్లు చేతులను చాపి నమస్కారం చేయుట దండ ప్రణామం.
👉పంచాంగ నమస్కారం :
రెండు పాదాల వేళ్లు, రెండు మోకాళ్లు, తల భూమిపైనుంచి రెండు చేతులను తలవద్దచేర్చి నమస్కారం చేయుట పంచాంగ నమస్కారం. ఇది ఎక్కువగా స్త్రీలు చేస్తారు.
👉ప్రవరతో నమస్కారం : అభివాదం భారతదేశ వ్యాప్తంగా హిందూమత సంబంధమైన విధులు నిర్వర్తించేప్పుడు, మతాచార్యుల ఎదుట, భగవంతుని ముందు ప్రవర చెప్పి నమస్కరిస్తూంటారు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణస్య శుభం భవతి. -గోత్రనామం- గోత్రస్య -వంశానికి చెందిన ముగ్గురు ఋషుల పేర్లు- త్రయార్షయ ప్రవరాన్వితః -గృహ్యసూత్రం పేరు- సూత్రః -అభ్యసించే వేదం- శాఖాధ్యాయీ -నమస్కరిస్తున్న వారి పేరు- అహంభో అభివాదయే అంటూ నమస్కరించడం వైదిక విధానం. చేతి వేళ్లను చేవుల వెనుకకు చేర్చి ముందుకు కాస్త వంగిన భంగిమలో పై సంస్కృత వాక్యాన్ని ఉచ్చరిస్తారు. మనుష్యులకు నమస్కరించేప్పుడు కుడిచేయిని ఎడమచెవికి, ఎడమచేయిని కుడిచెవికి చేర్చి ప్రవర చెప్పాలి. దేవతలకు నమస్కరించాల్సివస్తే ఎడమచేతిని ఎడమచెవికి, కుడిచేతిని కుడిచెవి వెనక్కి చేర్చి ప్రవర చెప్తారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.