ఊబకాయం తో బాధపడే వారు , లావు తగ్గాలని కోరుకుంటున్నవారు రాత్రి సమయం లో అన్నం మానేయడం చాలా మంచి పద్ధతి. రాత్రి సమయంలో మనం చేసే పని కూడా ఎం ఉండదు. డాక్టర్స్ కూడా ఈ మధ్య రాత్రి పూట చపాతీ తినమని సజెస్ట్ చేస్తున్నారు.అలా చెప్పడం తో చాలా మంది దీనివైపే మొగ్గు చూపిస్తున్నారు. కాకపోతే చపాతీ తినేవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
–> చపాతీ ని చాలా తక్కువ నూనె తో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువు గా ఉంటాయి.
–> అసలు నూనె వేయకుండా ఉంటె మరింత మంచిది.
–> ప్లేట్ నిండుగా భోజనం లేదా రెండు , మూడు చపాతీ లు తిన్నా ఒకటే అని డాక్టర్స్ చెబుతున్నారు.
–> అన్నం కంటే చపాతీ శరీరానికి చాలా మంచిది , అధిక శక్తి ని ఇస్తుందని నిరూపితం ఐనది.
–> శక్తి ని ఇస్తున్న అంత మాత్రాన చపాతీల్లో కొవ్వు పదార్ధలు ఉండవు.
— > ఎందుకంటే గోదుమ్మలో కొవ్వు పదార్థలు ఉండవు. వాటిలో ఎక్కువు గా విటమిన్ బి, జింక్, మాంగనీస్, సిలికాన్ , ఇలా ఎన్నో ఖనిజాలు ఉంటాయి.
–> భోజనం చేయడానికి , నిద్ర పోవడానికి గ్యాప్ ఉంటె బావుంటుంది. అలా చేయలేని వారికి చపాతీ తీసుకోవడం ఉత్తమం.
–> పని ఒత్తిడి లో ఏ అర్ధరాత్రో భోజనం చేసి కకునుకు తీసుకుంటారు, కానీ ఆ విధంగా గా చేయడం ఆరోగ్యానికి హానికరం.
–> చపాతీ ఎక్కువుగా తినకూడదు.
–> ప్రతి రోజు మోతాదు కు మించి తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.