Jack Movie Twitter Review: జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హిట్టు కొట్టరా..?

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన వైష్ణవి చైతన్య కథానాయికగా నటించింది. తాజాగా ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది.

టాలీవుడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ చాలా కాలం తర్వాత తెరకెక్కించిన సినిమా జాక్. డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటించింది. స్పై యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ మూవీ విడుదలకు ముందే క్యూరియాసిటీని కలిగించింది. ఇప్పటికే ప్రమోషన్లలతో సినిమాపై హైప్ పెంచేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ఉదయం నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తుంది. ఫ్యామిలీ, లవ్ స్టోరీ సినిమాల దర్శకుడిగా ముద్రపడిన బొమ్మరిల్లు భాస్కర్ ఈసారి తన జానర్ మార్చి జాక్ మూవీని తెరకెక్కించాడు.

ఎప్పటిలాగే సిద్ధు జొన్నలగడ్డ వన్ లైనర్స్, కామెడీ టైమింగ్ ఈ సినిమాకు పెద్ద రిలీఫ్ గా నిలిచాయని అంటున్నారు. అలాగే వైష్ణవి చైతన్య సైతం మరోసారి తనదైన నటనతో అలరించింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading