సీఎం జగన్..బాలయ్య స్థానమయ్యిన హిందూపురం పై కొత్త నిర్ణయం తీసుకోబోతున్నాడట. అదే గనుక జరిగితే హిందూపురం నియోజికవర్గంపై బాలయ్య పట్టుకోల్పోవడం గ్యారెంటీ నట. 🔴హిందూపురం బాలయ్య ఇలాకా :…
ముగిసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఒకే ఒక్క టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ. హిందూపురం నియోజికవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించాడు బాలయ్యబాబు. రాష్ట్రమంతటా వైసీపీ ఫ్యాను గాలి బలంగా వీచినా… బాలయ్య ఇలాకాలో మాత్రం సైకిల్‌కు ఎదురులేకపోయింది.
👉హిందూపురం లో తెలుగు దేశం రికార్డ్స్: దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్… హిందూపురం నుంచే ప్రాతినిధ్యం వహించి… రెండు సార్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. తండ్రి పోటీచేసిన స్థానం మీద ప్రేమతోనే బాలయ్య ఇక్కడి నుంచి బరిలో దిగారు… రెండుసార్లు విజయం సాధించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి… బాలయ్య బాబుకు చెక్ పెట్టి చరిత్ర ను మార్పు చేస్తున్నట్టు సమాచారం. అదేంటంటే
👉 పార్లమెంటు స్థానాన్ని జిల్లాగా మార్చే ప్రక్రియ : ఎన్నికల ముందే చెప్పినట్టుగా ప్రతీ పార్లమెంటు స్థానాన్ని జిల్లాగా మారుస్తానన్న వైఎస్ జగన్… ఆ దిశగా అడుగులు వేసేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు.
👉ఇక కొత్త జిల్లా గా మారనున్న హిందూపురం : అనంతపురం జిల్లా నుంచి హిందూపురం నియోజికవర్గాన్ని విడదీసి… కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్. 👉హిందూపురం పార్లమెంట్ నియోజికవర్గం పరిధిలో మూడు రెవెన్యూ డివిజన్లు, 34 మండలాలు ఉన్నాయి. 👉వాణిజ్య కేంద్రంగానే కాకుండా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి దగ్గరలో ఉంటుంది. హిందూపురాన్ని జిల్లాకేంద్రంగా మారిస్తే నియోజికవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. అందుకే హిందూపురం ని జిల్లాగా మారిస్తేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు వైఎస్ జగన్. 🔴ఇదే గనుక జరిగితే బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలో వైసీపీ ఫ్యాను గాలి బలంగా వీచే అవకాశం ఉంది.
ఇప్పటికే వైసీపీ సునామీ కారణంగా ముందుగా అనుకున్న కెఎస్ రవికుమార్ సినిమాను పక్కన పెట్టిన బాలయ్యకు వైఎస్ జగన్ నిర్ణయాల కారణంగా పొలిటికల్‌గా కూడా దెబ్బ పడే అవకాశం కనిపిస్తోంది.
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో ఈసారి టీడీపీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితమయ్యింది. హిందూపురం నుంచి బాలయ్యతో పాటు ఉరవకొండ అభ్యర్థి పయ్యావుల కేశవ్ మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. అనంతపురం ఎంపీ స్థానం కూడా వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల ఫలితాలతో ఢీలా పడిన తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వైఎస్ జగన్ నిర్ణయాలు మరింత భయాన్ని రేకెత్తిస్తున్నాయి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.