పవన్ కళ్యాణ్ భక్తుడు,నిర్మాత బండ్ల గణేష్ మొన్నా మధ్య మీడియా వర్గాలతో మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్ తో 100 కోట్ల భారీ సినిమా తీయబోతున్నట్లు వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవాలు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీనితో పవన్ కళ్యాణ్ కెరియర్ కేవలం 25 సినిమాలతోనే ముగిసిపోతుందా అన్న బాధ బయటకు వ్యక్త పరచక లేక బయటకు వస్తున్న లీకులను చూసి మెగా అభిమానులు విపరీతమైన నిరూత్సాహంలో ఉన్నట్లు టాక్.. 🔴పవర్ స్టార్ గా తెలుగు రాష్ట్రాల ప్రజలలో విశేష అభిమానాన్ని పొందిన పవన్ కళ్యాణ్ ‘జనసేన’ తో రాజకీయాల బాట పట్టి తనదైన స్థానాన్ని నిరూపించుకుంటాడు అని భావించారు అంతా. అయితే అనూహ్యంగా పవన్ పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాలలోనూ ఓడిపోవడం అభిమానులకు మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీ మెంబర్స్ కు కూడ ఊహించని షాక్ గా మారింది.అయినా కూడా పవన్ తన పట్టు వీడ లేదు.
🔴జనసేనాని ఇక జనం తోనే: ఈమధ్య హైదరాబాద్ లో తనను కలిసిన తన కుటుంబ సభ్యులు కొందరితో పవన్ తన మనసులోని మాటను బయటపెట్టినట్లు లీకులు వస్తున్నాయి. ఇక తన మనసు సినిమాల పై లగ్నం చేయలేనని తనకు ఎన్ని ఆఫర్లు వచ్చినా ఇక మళ్ళీ కెమెరా ముందుకు రావాలి అని తనకు అనిపించడం లేదనీ అన్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఇక రాబోయే కాలంలో పూర్తిగా తాను ప్రజా క్షేత్రంలోనే ఉంటానని జయాపజయాలు తన నిర్ణయాలను ప్రభావితం చేయలేవు అని కూడ పవన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. రాబోతున్న 5 సంవత్సరాలు తాను పూర్తిగానే జనం మధ్య అధికారం లేకపోయినా తన పోరాటాన్ని కొనసాగించమని తన మనస్సాక్షి చెపుతోంది అంటూ పవన్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఈవార్త పవన్ అభిమానుల మధ్య వైరల్ గా మారింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.