రాంగోపాల్ వర్మ,జేడీ చక్రవర్తి వీళ్లిద్దరూ.. గురు శిష్యులు మాత్రమే కాదు,ఒకరి పై మరొకరికి మంచి అవగాహన ఉన్న ఫ్రెండ్స్ కూడా.అయితే ఇంత ఫ్రెండ్స్ మధ్య లో కూడా ఒక విషయంలో గొడవ జరిగింది అట .అది జేడీ మాటల్లోనే …
🔴ఆ హీరోయిన్ విషయంలో :
ఇన్నేళ్ల జర్నీలో రాంగోపాల్ వర్మతో నేను గొడవ పడటం కానీ, విబేధాలు రావడం కానీ ఎప్పుడూ జరుగలేదు. అయితే శ్రీదేవి విషయంలో మా ఇద్దరికీ చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి. ఇద్దరికీ శ్రీదేవి ఇష్టం. అదే అక్కడ సమస్య అయింది. క్షణక్షణం సినిమాకు వర్మ డైరెక్టర్ అనే విషయం మరిచిపోయి ఆమెను పటాయించడానికి ట్రై చేసినట్లు జేడీ గుర్తు చేసుకున్నారు.
💚శ్రీదేవి : అతిలోక సుందరిగా ఇండియన్ సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన తార. అప్పట్లో ఎంతో మందికి కలల రాణి. ఆమెను పెళ్లి చేసుకోవాలని చాలా మంది ప్రముఖులు ట్రై చేశారు. కానీ ఎవరికీ దక్కలేదు, ఎవరూ ఊహించని విధంగా ఆమె బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను రెండో పెళ్లి చేసుకుని సెటిలయ్యారు.శ్రీదేవి అంటే ఇష్టమున్నా… ఆ సమయంలో ఆ చాన్స్ నాకు దక్కలేదని జేడీ తెలిపారు..ఆయన మాట్లాడుతూ..
🔴గొడవకు ముఖ్య కారణం శ్రీ దేవి అమ్మ గారట :
ఇపుడు ఈ విషయం చెప్పకూడదు కానీ జరిగింది కాబట్టి చెబుతున్నాను. 👉ఒక రోజు శ్రీదేవి గారి మదర్ వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని నన్ను అడిగారు. ఆమె అలా అడగటంతో నేను షాకయ్యాను.
🔴ఈ విషయం తెలిసి రామూగారు హర్ట్ అయ్యారు:
శ్రీదేవి మదర్ నన్ను ఇలా అడిగిందనే విషయం తెలిసి రామూగారు కాస్త హర్ట్ అయ్యారు. ఆ విషయం నన్ను అడిగి ఉండొచ్చు కదా అని ఫీలయ్యారు. 👉రామూగారు ఉంటే ఆయన కూడా నాతో పాటు ఆ రోజు లంచ్‌కు వచ్చేవారు. అప్పుడు ఆయన బాంబేలో ఉండటంతో రాలేక పోయారని జేడీ తెలిపారు.
🔴 ఆమె అలా ఎందుకు అడిగిందో తర్వాత తెలిసింది :
ఆమెకు మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్లే ‘గులాబీ’ సినిమా చేస్తున్న సమయంలో మహేశ్వరి, వాళ్ల మదర్ మద్రాసులో శ్రీదేవిగారి ఇంట్లోనే ఉండేవారు. అపుడు వారు నన్ను లంచ్‌కు పిలిస్తే వెళ్లాను. వెళ్లినపుడు శ్రీదేవిగారి మదర్ బ్రెయిన్లో తప్పుడు ఆపరేషన్ జరుగడం వల్ల మతిస్థిమితం సరిగా లేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ల అమ్మాయికి ఇంకా పెళ్లి జరుగలేదు అనే విషయం ఆమె మైండ్లో అలాగే ఉండిపోయినట్లు ఉంది. నేను ఎవరో ఏమిటో తెలియకుండానే నా రెండు చేతులు పట్టుకుని మా అమ్మాయిని పెళ్లి చేసుకోవా? అని అడిగారు…. అని జేడీ గుర్తు చేసుకున్నారు.
👉 ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఈ సంచలన విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి తాజాగా ఒక మూవీ ప్రమోషన్లో భాగంగా ఆయన ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.