ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తారక్,మహేష్ ఇంకా మిగిలిన హీరో ల స్పెషలిటీస్ గురించి , రాజకీయాల గూర్చి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసారు.
🔴రాజకీయాలను గురించి : ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్‌కు ఒక అవకాశం ఇచ్చి చూస్తే బావుంటుందని ప్రజలు అనుకున్నారని,వైఎస్ జగన్మోమహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉంది. అలా అని చంద్రబాబు ఓడిపోవాలని కోరుకున్నట్లు కాదు. పవన్ కళ్యాణ్ గెలిచి ఉంటే బావుండేది, ఆయన ముక్కుసూటి మనిషి.”అని జెడీ అభిప్రాయపడ్డారు.
సినిమాల గురించి : 👉 🔴తారక్ ఆంటే భయం : జూ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే చాలా టాలెంట్ ఉన్న పర్సన్. తారక్ నిలువెల్లా టాలెంటుతో నింపబడిన మనిషి. నాకు చాలా క్లోజ్. అయితే అవతలి వారికి ఒక్కోసారి అతడు పెట్టే టెన్షన్ భయానకంగా ఉంటుంది. ఒకరోజు నన్ను కార్లో కూర్చోబెట్టుకుని మేఘాలలో తేలిపోతున్న సాంగ్ ఫుల్ సౌండ్ పెట్టి కళ్లు మూసుకుని 110 కిలోమీటర్ల స్పీడ్లో నడిపాడు. చాలా భయపడిపోయాను. మళ్లీ జీవితంలో నీ కారు ఎక్కను అన్నాను… ఇప్పటి వరకు ఎక్కలేదు.
👉🔴మహేష్ బాబు అలాంటి సినిమాలే చెయ్యాలి : ‘పోకిరి’ లో మహేష్ బాబు చేసిన పాత్ర మహేష్ రియల్ లైఫ్ కు చాలా దగ్గరగా ఉంటుందని నా ఫీలింగ్.ఆయన అలాంటి సినిమాలు చేస్తేనే బావుంటుంది. ఆయన మాట్లాడే పద్దతి, వ్యంగ్యం నాకు చాలా నచ్చుతుంది. ఇపుడు చేస్తున్న లార్జర్ దన్ లైఫ్ సినిమాలు చూసినపుడు నేను కనెక్ట్ కాలేకపోతున్నట్లు జెడీ తెలిపారు.
ఇక మిగిలిన హీరోస్ గురించి మాట్లాడుతూ : 👉చిరంజీవిగారు చాలా ఎనర్జీటిక్ అని, 👉బాలకృష్ణ చాలా కాన్ఫిడెంట్ అని, 👉నాగార్జున చాలా స్వీట్ పర్సన్ అని, 👉వెంకటేష్ బ్రాడ్ షోల్డర్స్ పర్సన్ అని, . యో
👉రామ్ చరణ్ వెరీ వెల్ బిహేవ్డ్ పర్సన్ అని, 👉ప్రభాస్ గురించి పర్సనల్‌గా తెలియక పోయినా కానీ సినిమాలు బాగా నచ్చుతాయన్నారు. 👉అల్లు అర్జున్ జెన్యూన్ పర్సన్ అని, 👉 విజయ్ దేవరకొండ చాలా ఓపెన్ మైండెడ్ అని చెప్పుకొచ్చారు.
🔹కాగా జెడీ చక్రవర్తి త్వరలో విడుదల కాబోతున్న ‘హిప్పి’ సినిమాలో కీలక పాత్ర ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.