Teluguwonders:
శనివారం రాత్రి ప్రసారమైన తమిళ బిగ్ బాస్ షోలో భాగంగా ఓ సందర్భంలో కమల్ హాసన్ సిటీ బస్సుల్లో ట్రావెలింగ్ అనుభవాలను వెల్లడించారు. ‘సిటీ బస్సుల్లో ప్రయాణించడం చాలా కష్టం. సమయానికి ఆఫీసుకు చేరడానికి చాలా కష్టపడుతుంటారు. ఇదే అదునుగా కొందరు మహిళలను అసభ్యంగా తాకకూడని చోట తాకుతారు’ అని వ్యాఖ్యానించారు. వెంటనే శరవణన్ కల్పించుకొని.. ‘నేను కూడా కాలేజీ రోజుల్లో ఇలాంటివి చేశాను’ అంటూ
అప్పట్లో కేవలం మహిళలను ఆట పట్టించడానికి, వారిని టచ్ చేయడానికే బస్సు ఎక్కేవాడినని, స్నేహితులతో కలిసి ఇలాంటి పనులు చేసినట్టు వెల్లడించారు.
దాంతో బిగ్ బాస్ 3 తమిళ్ రియాలిటీ షోలో కంటెస్టెంటు, నటుడు శరవణన్ వివాదంలో చిక్కుకున్నాడు. తాను కాలేజీ రోజుల్లో బస్సుల్లో ప్రయాణించేటపుడు మహిళలను తాకకూడని చోట తాకుతూ ఆనందపడే వాడినని తెలిపారు. అతని వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
🥊సింగర్ చిన్మయి స్ట్రాంగ్ రిప్లై :
వీడియో క్లిప్‌ని షేర్ చేసిన ఓ అభిమాని.. దీనిపై స్పందించమని సింగర్ చిన్మయిని కోరారు. ఆమె దీనికి సమాధానంగా.. ‘మహిళలను వేధించడానికే నేను బస్సు ఎక్కేవాడినంటూ ఒక వ్యక్తి గర్వంగా చెప్పుకోవడాన్ని కూడా ఛానల్స్ ప్రసారం చేయడం, ఇలాంటి సీరియస్ విషయాన్ని జోక్‌లా చూపెట్టడం, ఆడియన్స్ చప్పట్లు కొట్టడం బాధాకరమైన విషయమంటూ వ్యాఖ్యానించారు. బిగ్‌బాస్ షోలో ఇప్పటి దాకా ఇంటి సభ్యుల మధ్య వివాదాల్లో మాత్రమే గొడవలు జరిగేవి. ప్రస్తుతం ఇలాంటి విషయాన్ని తేలికగా చూపించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తమిళ బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్ శరవణన్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపిన సంగతి తెలిసిందే. పైగా ఆ వ్యాఖ్యలను కమల్ హాసన్ ప్రోత్సహించినట్లుగా ఉండటం మరింత అగ్గి రాజేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ కాగా.. ఈ వ్యవహారంపై ప్రముఖ గాయని చిన్మయి కూడా స్పందించింది.
👉అసలు వివాదం ..:
బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మహిళలను తాకుతూ ఆనందపడే వాడినని శరవణన్ తెలిపడం ఒక తప్పయితే 😳ఆ తర్వాత కమల్ దానిని ఒక సరదా సన్నివేశంగా మార్చి ఇప్పడు శరవణన్ అలాంటివాడు కాదు, పూర్తిగా మారిపోయి ఉంటాడంటూ ఆ సన్నివేశాన్ని దాటేయడం మరో తప్పు అంటున్నారు జనం 🔴బీజేపీ ప్రతినిధి నారాయణ తిరుపతి కూడా కమల్ తీరుపై మండిపడ్డారు.
‘ఒక బాధ్యతయుతమైన రాజకీయ నాయకుడిగా ఉన్న కమల్ హాసన్.. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పమని అడగాల్సింది పోగా వాటిని ప్రోత్సహించినట్లుగా ఉందని’ అన్నారు. బిగ్ బాస్ షోలో ఆయన చేసింది అమోదయోగ్యంగా లేదని, శరవణన్ చేసిన వ్యాఖ్యలను ఖండించకపోగా సమర్థించడం సరికాదని ఆయన అన్నారు.
🔴నెటిజన్లు ఆగ్రహం :
శరవణన్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన సమస్యను ఒక జోక్‌లా బిగ్ బాస్ షోలో చూపించడం దానికి ఆడియన్స్ చప్పట్లు కొట్టడం విడ్డూరంగా ఉందంటూ మండిపడుతున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.