ఏపీలోని నెల్లూరు జిల్లా పరిధిలో ఒక దారుణం చోటు చేసుకుంది. సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ని పోలీస్ లందరూ ఈ కేస్ విషయం పై దిగ్భ్రాంతి కి లోను అవుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.
🔴ఆ దారుణం ఏంటంటే : ఒక యువకుడ్ని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు యువకులు. పోలిస్ లకుఆయువకుడ్ని కిడ్నాప్ చేసి రేప్ చెయ్యడానికి కారణం త్వరగా దొరకలేదు.
🔴గ్యాంగ్ రేప్ కి కారణం : ఈ విషయంపై పోలీసుల విచారణలో విస్మయానికి గురి చేసిన అంశం ఒకటి బయటకు వచ్చింది.
ఆ👉వివరాల్లోకి వెళ్తే : దొరవారి సత్రం మండలం ఉచ్చూరుకు చెందిన 26 ఏళ్ల యువకుడు బుధవారం సూళ్లూరుపేటలోని ఒక షోరూం వద్ద ఉన్నాడు.
ఇదిలా ఉంటే నాగరాజపురానికి చెందిన ఐదుగురు (దయాకర్.. బాల చెన్నయ్య.. వెంకటేశ్వర్లు.. మహేశ్.. మస్తాన్) అక్కడికి వచ్చారు. అతడ్ని మాటల్లో పెట్టి ఆటోలో కిడ్నాప్ చేశారు. అనంతరం మన్నారుపోలూరు శివార్లలోని తైలం చెట్లలోకి తీసుకెళ్లారు. ఆపై కర్రలతో దాడి చేశారు. అనంతరం ఐదుగురు వ్యక్తులు.. ఆ యువకుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాల్ని సెల్ ఫోన్లో వీడియో తీశారు.
ఎక్కడైనా.. ఎవరికైనా ఈ విషయాల్ని చెబితే చంపేస్తామని బెదిరించారు.
🔴బాధితుని కంప్లైంట్ : దాడికి గురైన బాధిత యువకుడు కోలుకొని సూళ్లూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
🔴పోలీసుల విచారణలో : నిందితుల్లో ఒకరి భార్యతో బాధిత యువకుడికి వివాహేతర సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ కారణాన్ని మనసులో పెట్టుకొనే ఇలాంటి పని చేసి ఉంటారని భావిస్తున్నారు. మనుషులు చివరికి జంతువులకన్నా దారుణంగా తయారౌతున్నారని దీన్ని బట్టి అర్థం అవుతుంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.