అనుష్కతో కోహ్లీ తొలి పలుకులు ఏంటో తెలుసా?

Kohli's And Anushka
Spread the love

Teluguwonders:

ముంబయి:

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్కశర్మది చక్కని ప్రేమకథ. సినిమాల్లో ప్రేమ జంటల మధ్య అలకలు సాధారణమే. అలాగే వీరి ప్రేమ కథలోనూ కొన్ని అలకలు ఉన్నాయి. స్నేహంతో చిగురించిన ప్రేమబంధానికి ఒకనొక సమయంలో అడ్డంకులు వచ్చాయి. చలన చిత్రాల్లో మాదిరిగా తమ విరహాన్ని ఈ జంట మరింత దగ్గరయ్యేందుకే ఉపయోగించుకుంది. చివరికి 2017లో ఇటలీలో వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. ఇంతకీ అనుష్కతో కోహ్లీ తొలి పలుకులు ఏమిటో తెలుసా?

అమెరికన్‌ టెలివిజన్‌ స్పోర్ట్స్‌ రిపోర్టర్‌ గ్రాహమ్‌ బెనసింజర్‌కు ఇచ్చిన ముఖాముఖిలో అనుష్కతో తన తొలిపరిచయం ఎలా సాగిందో విరాట్‌ వివరించాడు. తాను ఆమెతో మాట్లాడిన తొలిపలుకులు ఏంటో చెప్పాడు.

యాదృచ్ఛికంగా వీరిద్దరి తొలి పరిచయం అంత రొమాంటిక్‌గా ఏమీ సాగలేదు. అనుష్క, కోహ్లీ ఓ షాంపూ ప్రకటన కోసం తొలిసారి కలుసుకున్న సంగతి తెలిసిందే.

అనుష్క ప్రొఫెషనల్‌ నటి కావడంతో విరాట్‌ కాస్త నెర్వస్‌కు గురయ్యాడట. ఎలాగైనా ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించాడు. మంచి జోక్‌ వేస్తే బాగుంటుందని అనుకున్నాడు. ‘ఇంతకన్నా ఎత్తైన హీల్స్‌ నీకు దొరకలేదా?’ అని ఆమె పొడవుపై జోకేశాడు. దీనికి అనుష్క నుంచి ఊహించిన స్పందన రాకపోవడంతో దిగాలుపడ్డాడు. ఫలితంగా అదో చెత్తజోక్‌గా మారింది. కోహ్లీ 6 అడుగుల ఎత్తు ఉండడు కాబట్టి హీల్స్‌ వేసుకోవద్దని ముందుగానే ఆమె మేనేజర్‌ సమాచారం ఇచ్చాడు. కానీ కోహ్లీ అదే జోక్‌ పేల్చడంతో పరిస్థితి పొయ్యిలో పడ్డ పెనంగా మారింది. ఏదేమైనప్పటికీ వీరిద్దరూ తరచూ కలుసుకోవడంతో స్నేహం పెరిగింది. అది గాఢంగా మారి ప్రేమగా చిగురించింది. వీరిద్దరినీ ఒక్కటి చేసింది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading