Teluguwonders:
⭐డాటర్ ఆఫ్ ది నేషన్..గా లతా మంగేష్కర్
బాలీవుడ్ దిగ్గజ గాయకురాలు, ఏడు దశాబ్దాలకు పైగా తన మధురమైన గానంతో ప్రేక్షకులను అలరిస్తున్న గాన కోకిల లతా మంగేష్కర్‌ను నరేంద్ర మోదీ ప్రభుత్వం సత్కరించబోతోంది. ఈ సెప్టెంబర్ 28న లతా మంగేష్కర్ 90వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఆమెకు పుట్టినరోజు కానుకగా భారత ప్రభుత్వం ‘డాటర్ ఆఫ్ ది నేషన్’ బిరుదు అందజేస్తోంది.
లతా మంగేష్కర్.. ఆమె పాట వింటుంటే చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది. తన పాటతో మూడు తరాల సంగీత ప్రియులను అలరించిన దిగ్గజ గాయకురాలు ఆమె.
🎼 లతా మంగేష్కర్ :
1929 సెప్టెంబర్ 28న లతా మంగేష్కర్ ఇండోర్‌లో జన్మించారు. పలు భాషలలో పాటలు పాడారు. లతా మంగేష్కర్ 1942 నుంచి తన కెరీర్‌ను మొదలుపెట్టారు. 1000 కి పైగా హిందీ చిత్రాలలో 25 వేలకు పైగా పాటలు పాడారు. ఆమె తండ్రి దిననాథ్ మంగేష్కర్ శాస్త్రీయ గాయకులు, నాటక కళాకారులు. ఆయన అడుగజాడలలో నడచిన లతా మంగేష్కర్ మంచి గాయకురాలిగా పేరు ప్రఖ్యాతలు పొందారు.
లతా మంగేష్కర్ ఇప్పటికే జాతీయ చలనచిత్ర అవార్డు, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు భారత ప్రభుత్వం నుంచి అందుకున్నారు.
🔴ఆ ప్రత్యేక పాటను ఆమెకు అంకితం:
ఇండియన్ సినిమా సంగీతానికి లతా మంగేష్కర్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ఈ బిరుదును అందజేస్తోంది. లతా మంగేష్కర్ పుట్టినరోజును పురష్కరించుకుని ఆరోజున ప్రముఖ కవి, పాటల రచయిత ప్రసూన్ జోషి ఒక ప్రత్యేక పాటను ఆమెకు అంకితం చేయబోతున్నారు.
70 ఏళ్ల పాటు సుధీర్ఘంగా సంగీత ప్రేమికులను తన గానంతో మంత్ర ముగ్ధల్ని చేస్తోన్న లతా మంగేష్కర్‌కు ప్రధాన నరేంద్ర మోదీ వీరాభిమాని. అందకే, తనతో పాటు కొన్ని కోట్ల మంది ఆరాధ్య గాయకురాలైన లతా మంగేష్కర్‌ను మోదీ సత్కరించాలని భావించారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.