మామూలుగా రేషన్ కార్డులు అంటే ఎలా ఉంటాయి ..అయితే వైట్ గా ఉంటాయి , లేదంటే పింక్ కలర్ లో ఉంటాయి . ఎప్పటి నుండో ఇదే పద్ధతి కొనసాగుతోంది .
ఎన్నో ఏళ్లుగా వాటిని చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ అవే రంగులు. అవే డిజైన్లు. చూసీ చూసీ బోర్ కొట్టేస్తోంది… కదూ..అయితే ఈ పద్దతి ని కొత్త ప్రభుత్వం. మార్చలన్న ఆలోచనకు వచ్చినట్లు..త్వరలోనే మార్చేసేయబోతున్నట్లు.. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
🎊రంగం సిద్ధమౌతుంది : పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న కోన శశిధర్… ఈ రేషన్ కార్డుల మార్పులకు సంబంధించిన అంశాన్ని పరిశీలించబోతున్నారు. ఇప్పటికే పౌరసరఫరాలశాఖ అధికారులు రేషన్ కార్డుల రంగులు, వాటిపై ఉండాల్సిన చిహ్నాలు, ఫొటోలు తదితర అంశాలన్నింటినీ ఉంచిన 5 రకాల కార్డు మోడళ్లను కమిషనర్‌కు ఇచ్చినట్లు తెలిసింది.జనవరిలో జరిపిన కలెక్టర్ల సదస్సు నాటికి కొత్త రేషన్ కార్డులకు 53,901 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 6,777 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన వాటికి కార్డులు ఇచ్చే విషయాన్ని టీడీపీ ప్రభుత్వం పక్కనబెట్టింది. సో, కొత్త ప్రభుత్వం వాటిని ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రంలో రేషన్ కార్డుల రంగు, గుర్తుల మార్పులతో పాటూ రేషన్ కార్డుల సంఖ్యలో కూడా మార్పులు ఉంటాయా అన్నది మున్ముందు మనకు తెలుస్తుంది.
🔴పరిశీలనలో..కొత్త మోడల్స్:
కమిషనర్ కొత్త మోడళ్లను పరిశీలించి, తన ప్రతిపాదనలను ప్రభుత్వానికి ఇస్తారు. పాత రేషన్ కార్డుల డిజైన్లనే మార్చుతారా… లేక కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తారా అనేది కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఏపీలో 1,43,81,886 రేషన్ కార్డులు ఉన్నాయి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.