అభిమానులు తమ తమ నటులను మెచ్చుకోవడం ఇప్పటివరకు చూశాం నటులు తమ తమ అభిమానుల గొప్పదనాన్ని గుర్తించడమే కాదు, ప్రశంసిస్తున్నారు కూడా. మొన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకతను చనిపోతే జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ,అలాగే అల్లుఅర్జున్ ఆఫీస్ బాయ్ పెళ్లికి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వెళ్ళడం కూడా మనకు తెలిసిందే.ఇలా అభిమానుల మంచి చెడులను కూడా వీరు గమనిస్తున్నారు . అలాగే లారెన్స్ కూడా వ్యక్తిగతంగా తన అభిమానులను ఎంతో ఆదరిస్తాడు, ప్రోత్సహిస్తాడు కూడా . విషయం లోకి వెళ్తే👉ప్రముఖ కొరియోగ్రాఫర్, యాక్టర్ రాఘవ లారెన్స్ నటిస్తూ, డైరెక్ట్ చేసిన ముని సిరీస్ సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సిరీస్‌లో వచ్చిన నాలుగవ సినిమా కాంచన-3లో లారెన్స్ యాక్టింగ్‌కి మంచి అప్లాజ్ వచ్చింది.
🎉Tiktok లో : రీసెంట్‌గా లారెన్స్ అభిమాని ఒకతను కాంచన-3 లోని ఒక సీన్‌ను టిక్ టాక్‌లో వీడియో చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
🎉దానిని చూసిన లారెన్స్ :
‘వీడియో చాలా బాగుంది బ్రదర్, నాకంటే బాగా చేసావ్, ఆల్ ది బెస్ట్’.. అంటూ లారెన్స్ సదరు వీడియోను షేర్ చేస్తూ ఆ కుర్రాడిని మెచ్చుకున్నాడు. అచ్చు లారెన్స్‌లా గెటప్ వేసుకుని, కన్నీళ్ళు పెడుతూ నేచురల్‌గా నటించాడు లారెన్స్ ఫ్యాన్.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.