దేశమంతా అతిపెద్ద ప్రజాస్వామ్య యజ్ఞం గా భావించే సాధారణ ఎన్నికలు పూర్తయ్యాయి.ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. అసాధారణ రీతిలో..ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ రెండో సారి ప్రధానిగా తన బాధ్యతలు స్వీకరించారు. 58 మందితో క్యాబినెట్ కూడా కొలువుదీరింది. జూన్ 17న పార్లమెంటు సమావేశాలకు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో, లోక్ సభలో…సభ్యుల స్థితి గతుల పై ఒక లుక్ వేద్దాం.
🔴అత్యంత పేద ఎంపీ: తాజా లోక్ సభలో బీజేపీకి చెందిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ నలుగురు అత్యంత పేద ఎంపీల్లో ఒకరిగా నిలిచారు. ఆమె తన ఆస్తులను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. 👉మరి ధనికుడు ఎవరన్న చర్చకు వస్తే మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ కుమారుడు కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
🔴అత్యంత సంపన్నుడు :
నకుల్ నాథ్ ఈసారి లోక్ సభలో అతగాడే అత్యంత సంపన్నుడు. లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని ఛింద్వారా నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నాథన్ షా కవ్రేటీపై 37,536 ఓట్లతో గెలిచారు. కాగా, అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపిన వివరాల ప్రకారం నకుల్ నాథ్ ఆస్తుల విలువ రూ.660 కోట్లు. దీంతో ఇప్పుడు కొలువుదీరనున్న లోక్ సభలో నకుల్ నాథ్ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన ఏడాదికి రూ.2.76 కోట్లు ఆదాయం ఆర్జిస్తున్నారట.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.