హైదరాబాద్‌లో లవ్ జిహాద్ కేసులు.. ఆందోళన లో జనం

Love Jihad Cases in Hyderabad

Teluguwonders:

🔴హైదరాబాద్‌లో లవ్ జిహాద్ కేసులు.. సర్వత్రా ఆందోళన:

భాగ్యనగరంలో మూడు నెలల కిందట లవ్ జిహాద్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమ కుమార్తెను మతం మార్చి ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె తల్లిదండ్రులు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ప్రేమ పేరుతో తమ కుమార్తెను మత మార్పిడి చేసి, ఎవరికీ తెలియకుండా దాచారంటూ మంచిర్యాలకు చెందిన రేణుక, మహేశ్ దంపతులు ఫిర్యాదు చేశారు.
రేణుక, మహేశ్ దంపతుల కుమార్తె ఇందిరా, కరీంనగర్‌కు చెందిన రిజ్వాన్‌ కలిసి కరీంనగర్‌లోని ఓ కాలేజీలో ఇంజనీరింగ్ చదివారు. ఆ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. చదువు పూర్తి కాగానే 2018 జులైలో వీరిరువురూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇందిరా ఇస్లాం మతాన్ని స్వీకరించడంతో పాటు తన పేరును జుబేరాగా మార్చుకుంది. ఆ తర్వాత ఇద్దరూ హైదరాబాద్ వచ్చి ఉద్యోగాల్లో చేరారు.

జుబేరా టెక్ మహంద్రలో, రిజ్వాన్ మరో సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరారు. అయితే తమ కుమార్తెకు బలవంతంగా మత మార్పిడి చేసి లవ్ జిహాద్ పేరుతో సిరియాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఇందిరా తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమార్తె తమను చూడాలని ఉందంటూ మెసేజ్ పంపి, ఆ తర్వాత కనిపించకుండా పోయిందంటూ ఫిర్యాదు చేశారు. ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆరోపించడం అప్పట్లో సంచలనం రేపింది. తమ కూతురిని వెతికిపెట్టాలని వారు కోరారు.

💥 మరో లవ్ జిహాద్ వ్యవహారం :

హైదరాబాద్‌లో మరో లవ్ జిహాద్ వ్యవహారం కలకలం రేపుతోంది. రఫీక్ అనే యువకుడు ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఓ దళిత యువతి పోలీసులను ఆశ్రయించింది. బలవంతంగా తన మతం మార్చి పెళ్లి చేసుకొని అవసరం తీరాక వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపించింది. ఈ మేరకు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం (సెప్టెంబర్ 3) ఫిర్యాదు చేసింది.

🔴వివరాల ప్రకారం :

వరంగల్‌కు చెందిన కృష్ణవేణి, రఫీక్ ఆరేళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత రఫీక్ ఆమె మతం మార్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కృష్ణవేణి పేరును షబానాగా మార్పించాడు. మొదట్లో బాగానే ఉన్న రఫీక్ ఆ తర్వాత వేధించడం ప్రారంభించాడని బాధితురాలు తెలిపింది. గర్భం దాల్చిన తర్వాత పుట్టింటి నుంచి డబ్బులు తేవాలంటూ వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. నాలుగు సార్లు అబార్షన్ చేయించాడని తెలిపింది. తాజాగా మరోసారి తాను మరోసారి గర్భం దాల్చాక తనను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

రఫీక్‌పై పోలీసులకు ఇప్పటికే నాలుగు సార్లు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. పోలీసులు కూడా అతణ్ని స్టేషన్‌కు పిలిపించి పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పారిపోయిన రఫీక్ కోసం గాలింపు చేపట్టారు.

కేరళ, ఉత్తరాది రాష్ట్రాల్లో వినిపించే ఈ లవ్ జిహాద్‌పై ఇప్పుడు హైదరాబాద్‌లోనూ విస్తరిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా మరో లవ్ జిహాద్ ఉదంతం ఇలా వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading