Teluguwonders:
ఆంధ్రా తయారీ కియా కారు లాంఛనంగా మార్కెట్‌లోకి విడుదలైంది. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో సుమారు 530 ఎకరాల విస్తీర్ణంలో రెండేళ్ల క్రితం ప్రారంభమైన కియా మోటార్స్ కంపెనీ అతివేగంగా నిర్మాణం జరిగింది. అంతేవేగంగా కార్ల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో తయారైన తొలి కారును గురువారం విడుదల చేశారు. సెల్టాస్ మోడల్ వాహనాన్ని గురువారం కియా సంస్థ ఆవిష్కరించింది. దీంతో..ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ రంగంలో నవశకం ఆరంభమైంది.
❄.భావోద్వేగ క్షణం; ‘కియ’ ప్రతినిధులు:
భారతదేశంలోని తమ ప్లాంటు నుంచి మొట్టమొదటి సెల్టోస్ కారును బయటకు తీసుకురావడం తమకు భావోద్వేగ క్షణమని కియ మోటార్స్ ఇండియా ఎమ్‌డీ, సీఈవో కూక్యూన్ షిమ్ అన్నారు. ‘‘అనంతపురంలో ఏర్పాటుచేసిన కియ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా మేం నెలకొల్పిన 15వ ప్లాంట’’ అని తెలిపారు. 2017 సెప్టెంబరులో పనులు ప్రారంభించి రెండేళ్లలోనే ఉత్పత్తిని ప్రారంభించడం సంతోషదాయకమని కియ పరిశ్రమ భారత ప్రతినిధి షిమ్‌బోంగ్‌కిల్ అన్నారు.
🚗ఈ నెల 22 నుంచి కియా కార్ల అమ్మకం :
ఈ నెల 22 నుంచి మార్కెట్‌లో కియా కార్లను విక్రయించనున్నట్టు కియా మోటార్స్ ఎండీ కుంషిమ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 206 షోరూమ్‌లలో ఈ కార్లఅమ్మకాలు జరుపుతామని చెప్పారు. వెబ్‌సైట్ తెరిచిన రోజునే 6వేల కార్లు ముందస్తు బుకింగ్ అయ్యాయన్నారు. నేటి వరకు 23వేల మంది కార్ల కోసం ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ సహాయ సహకారాలతోనే లక్ష్యానికి ముందుగా ఈ కార్లను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. 👉ఈ కార్యక్రమంలో కియా సంస్థ ప్రతినిధులతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా పాల్గొన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.