మహేష్‌బాబు, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమాస్ పతాకాలపై దిల్‌రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మహర్షి’. ఇటీవల విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించ బడుతోంది. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తుంది. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మహేష్ గత కలెక్షన్ల రికార్డులను క్రాస్ చేసింది. 🔹తాజాగా ఈ చిత్రం 20 రోజుల్లో రూ.175 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు.
👉ఇంతటి విజయానికి కారణాలు : సోషల్ మెసేజ్ తో కూడిన కథను వంశీ ఎంచుకోవడం..దానికి మహేష్ ప్రాణం పెట్టడం సినిమా ను ఎక్కడికో తీసుకెళ్లింది. రిషి పరుగు చూస్తుంటే అతి తొందరలోనే రూ.200 కోట్ల మార్క్‌ను అందుకునేలా ఉన్నాడే అనిపిస్తుంది.
🔴200 కోట్ల దిశగా:
👉గతంలో ‘భరత్ అనే నేను’ సుమారు రూ.160 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. ఇప్పుడు ఈ రికార్డును ‘మహర్షి’ క్రాస్ చేసేసింది. 👉‘నాన్ బాహుబలి’ రికార్డులను చూస్తే..; ‘రంగస్థలం’ అత్యధికంగా రూ.214 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. మరి ఆ రికార్డు ను మహేష్ చెరిపివేస్తాడో లేదో చూడాలి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.