“సరిలేరు నీకెవ్వరు..”అంటూ సరికొత్తగా సిద్ధం అవుతున్నాడు ‘మహర్షి’తో మంచి విజయం తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు .ఆయన త్వరలో ‘F 2′ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న డు. 👉ఎకె ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర నిర్మించబోతున్న ఈ చిత్రానికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని, మహేష్ బాబు కూడా ఈ టైటిల్ మీద సుముఖంగా ఉండటంతో రిజిస్టర్ చేసినట్లు టాక్. సమాజంలోకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ తీసుకెళ్లే కథ కాబట్టి ఈ టైటిల్ అద్భుతంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఇది మహేష్ బాబు కెరీర్లో 26వ చిత్రం కాగా… ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న తొలి చిత్రం.
👉సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున ముహూర్తం :మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా లాంచ్ చేశారు చిత్ర యూనిట్..
దర్శకుడు అనిల్ రావిపూడి కొన్ని నెలల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా లాంచ్ చేసి జూన్ నుంచి షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం యూరఫ్ వెకేషన్లో ఉన్న మహేష్ అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే షూటింగులో జాయిన్ కాబోతున్నాడు.
🔹రష్మిక హీరోయిన్ గా:
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మహేష్ స్థాయి స్టార్‌తో ఆమెకు ఇది తొలి అవకాశం.
✅లేడీ superstar విజయశాంతి రీ ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణ గా:
ప్రముఖ నటి, నిన్నటి తరం స్టార్ హీరోయిన్ లేడీ superstar విజయశాంతి ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి చాలా కాలం తర్వాత ఇపుడు తెరంగ్రేటం చేస్తుండటం కూడా ఈ మూవీపై అంచనాలు పెంచింది.
👉దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ :
ఈ సినిమాకు కూడా మరోసారి దేవిశ్రీ ప్రసాద్ ఎంపికయ్యారు. ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.అయితే సినిమాకు సంబంధించిన ఏ విషయం ఇంకా అఫీషియల్‌గా ప్రకటించలేదు. త్వరలో నే అన్ని విషయాలు అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.