ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన కలిగే సమస్యలు

Spread the love

ప్లాస్టిక్ సంచులు- ఒక పర్యావరణ ప్రమాదం

ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన జరిగే సమస్య, వ్యర్ధ పదార్థాల యాజమాన్య పద్ధతులలోని లోపాలే ప్రాథమికంగా కారణము. కాలువలు మూసుకుపోవడం, భూగర్భజలాల కాలుష్యం మొదలైనవాటితోపాటు విచక్షణారహితంగా ఉపయోగించే రసాయనాల వల్ల పర్యావరణ సమస్యలు కలుగుతాయి.

ప్లాస్టిక్ అంటే ఏమిటి?

ప్లాస్టిక్ అంటే పోలిమర్లు, మోనోమర్లు అనే పునరుక్తమయ్యే యూనిట్లని కలిగి ఉన్న పెద్ద అణువులు. ప్లాస్టిక్ సంచుల విషయంలో, పునరుక్తమయ్యే యూనిట్లు “ఎథిలిన్”. పోలిఎథిలిన్ ఏర్పడడానికి ఎథిలిన్ అణువులు బహురూపం చెందినపుడు, అవి పొడవైన కర్బన అణువుల చెయిన్లను ఏర్పరుస్తాయి. ఇందులో ప్రతి కార్బన్ రెండు హైడ్రోజన్ పరమాణువులతో బంధం ఏర్పరచుకుంటుంది.

ప్లాస్టిక్ సంచులు వేటితో తయారవుతాయి?

ప్లాస్టిక్ సంచులు మూడు రకాల మౌలిక పోలిమర్లలో ఏదైన ఒక దానితో తయారవుతాయి. పోలీఎథిలిన్- 1) ఎక్కువ సాంద్రతగల పోలి ఎథిలిన్ (హెచ్ డి పి ఇ), 2) తక్కువ సాంద్రతగల పోలి ఎథిలిన్ (ఎల్ డి పి ఇ), 3) సరళంగా తక్కువ సాంద్రతగల పోలి ఎథిలిన్ (ఎల్ ఎల్ డి పి ఇ). కిరాణా సంచులు సామాన్యంగా హెచ్ డి పి ఇతో మరియు డ్రై క్లీనర్ నుండి ఇచ్చే సంచులు ఎల్ డి పి ఇ అయి ఉంటాయి. ఈ మెటీరియల్ లో పెద్ద వ్యత్యాసం ఏమిటంటే, పోలిమర్ చెయన్ శాఖలుగా ఏర్పడే పరిమాణం. హెచ్ డి పి ఇ మరియు ఎల్ ఎల్ డి పి ఇ శాఖలుకాని చెయిన్లతో సరళంగా చెయన్లు ఉంటాయి ; ఎల్ డి పి ఇలో శాఖలుతో చెయిన్ల ఏర్పడతాయి.

ప్లాస్టి సైజర్లు అనేవి తక్కువ బాష్పశీల స్వభావముగల సేంద్రీయ ఈస్టర్లు. అవి, ఆహార పదార్థాలకి స్రవించిడం ద్వారా వలస పోగలుగుతాయి. ప్లాస్టిసైజర్లలో కూడా కేన్సరు కలుగ చేసే పదార్థాలని కలిగి ఉంటాయి. యాంటి ఆక్సిడింట్లు మరియు స్టెబిలైజర్లు సేంద్రీయ మరియు అసేంద్రీయ రసాయనాలు. ఇవి మేన్యుఫేక్చరింగు విధాన సమయంలో, ఉష్ణ వియోగం చెందకుండా రక్షిస్తాయి.

కాడ్మియం మరియు సీసం వంటి విషపూరిత ధాతువులు, ప్లాస్టిక్ సంచుల మాన్యుఫేక్చరింగులో ఉపయోగించినప్పుడు కూడా శ్రవించి ఆహార పదార్ధాలని కలుషితం చేస్తాయి. కాడ్మియం చిన్న మోతాదులలో శోషించినపుడు, వాంతులని మరియు గుండె పెద్దది కావడం కలగచేస్తుంది. ఎక్కువ కాలం సీసానికి గురైతే, మెదడు టిష్యూలు క్షీణించి పోతాయి.

మోసుకువెళ్ళే ప్లాస్టిక్ సంచులు వలన కలిగే సమస్యలు

ప్లాస్టిక్ సంచులని సరిగా పారవేయకపోతే, డ్రైనేజి సిస్టమ్ లోకి వెళ్ళి వాటిని మూసి వేయడం వలన అశుభ్రమైన వాతావారణాన్ని కలుగచేసి, నీటి ద్వారా వేచ్చే వ్యాధులను కలుగచేస్తాయి. పునర్వినియోగం /రంగుల ప్లాస్టిక్ సంచులు, భూమిలోనికి శ్రవించి మట్టిని, మరియు ఉప మట్టి నీటిని కలుషితం చేసే కొన్ని రసాయనాలని కలిగి ఉండవచ్చు. పునర్వినియోగం చేయడానికి ఉపయోగించే యూనిట్లు పర్యావరణపరంగా పటిష్టమైనవి కాకపోతే, పునర్వినియోగం సమయంలో ఉత్పత్తి అయ్యే విషపూరిత ఆవిరి వలన పర్యావరణ సమస్యలు కలుగుతాయి. మిగిలిపోయిన ఆహారం కలిగిఉన్న లేదా ఇతర వ్యర్ధ పదార్ధాలతో కలిసిపోయి ఉన్న కొన్ని ప్లాస్టిక్ సంచులను జంతువులు తినడం వలన హానికరమైన ప్రభావాలు కలుగుతాయి. పాడవ్వని మరియు చొచ్చుకు పోనీయని స్వభావంకల ప్లాస్టిక్ కారణంగా, మట్టిలో పారవేస్తే, భూగర్భ జల ఏక్విఫెర్లు నింపకుండా అడ్డుకోవచ్చు. అంతే కాకుండా, ప్లాస్టిక్ ఉత్పాదనల లక్షణాలని మెరుగు పరచడానికి మరియు పాడయ్యే ప్రతి చర్యని నిరోధించడానికి సాధారణంగా ఎడిటివ్లను మరియు ప్లాస్టిసైజర్లను, ఫిల్లర్లను, ఆగ్నిమాపకాలని మరియు పిగ్ మెంట్లని ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యం మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

వ్యర్ధ ప్లాస్టిక్ యాజమాన్య వ్యూహరచనలు

పలుచని ప్లాస్టిక్ సంచులు తక్కువ విలువ కలిగి ఉండి వాటిని వేరుపరచడం కష్టతరంగా ఉంటాయి. ప్లాస్టిక్ సంచుల మందాన్ని పెంచితే, ప్లాస్టిక్ సంచుల ఖరీదైనవిగా ఉండి, వాటి ఉపయోగాన్ని తగ్గించ వచ్చు. ప్లాస్టిక్ మేన్యుఫేక్చర్ అసోసియేషన్ మరియు చెత్తని తీసుకు వెళ్ళేవారు కూడా వ్యర్ధ సేకరణ మరియు తొలగించే విధానంలో పాల్గొనాలి.

ప్లాస్టిక్ ల కి ప్రత్యామ్నాయాలు

ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జనపనార లేదా క్లాత్ సంచులని వినియోగించడాన్ని జనరంజకం చేయాలి మరియు ఆర్థికపరమైన ఇన్సెంటివ్లతో ప్రేరేపించాలి. అయినప్పటికీ, పేపరు సంచులు తయారీలో చెట్లని కొట్టి వాటిని ఉపయోగించడం జరుగుతుంది, కాబట్టి వాటి వినియోగాన్ని పరిమితం చేయాలి. ముఖ్యముగా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులని మాత్రమే ఉపయోగించాలి, మరి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ని అభివృద్ధి చేయడానికి పరిశోధన జరుగుతుంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading