Teluguwonders:
4 బంతుల్లో 4 వికెట్లు…తీసి మలింగ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు .. మూడో బంతికి మన్రోను ఔట్ చేసిన మలింగ.. నాలుగో బంతికి రూథర్‌ఫర్డ్, ఐదో బాల్‌కి గ్రాండ్ హోమ్, ఆరో బంతికి టేలర్‌ను ఔట్ చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచులో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. న్యూజిలాండ్ కు చుక్కలు చూపించాడు.
💥4 బంతులు.. 4 వికెట్లు:
4 బంతుల్లో 4 వికెట్లు…తో మలింగ ప్రపంచ రికార్డ్ సాధించాడు. శ్రీలంక సీనియర్ బౌలర్ లసిత్ మలింగ మరోసారి అదరగొట్టాడు. న్యూజిలాండ్‌తో పల్లెకెలెలో జరిగిన మూడో టీ20లో చెలరేగిపోయాడు. బుల్లెట్‌లాంటి బంతులు విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి సత్తాచాటాడు. వరస బంతుల్లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కోలిన్ మన్రో (12), హమీష్ రూథర్‌ఫర్డ్ (0), కోలిన్ డి గ్రాండ్‌హోమ్ (0), రాస్ టేలర్ (0) ఓట్ చేశాడు. 👉అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు సార్లు (ట్వీ20, వన్డే) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు మలింగ. గతంలో 2007 వన్డే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా జట్టుపై నాలుగు వికెట్లు సాధించాడు.
ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ మలింగ దెబ్బకు కకావికలమైంది. దాంతో న్యూజిలాండ్ 16 ఓవర్లలో 88 పరుగులు చేసి 37 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
👉వివరాల్లోకి వెళ్తే :
న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 రన్స్ చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టును మలింగ దెబ్బకొట్టాడు. మూడో ఓవర్లోనే న్యూజిలాండ్ జట్టును కుప్పకూల్చాడు. మూడో బంతికి మన్రోను ఔట్ చేసిన మలింగ.. నాలుగో బంతికి రూథర్‌ఫర్డ్, ఐదో బాల్‌కి గ్రాండ్ హోమ్, ఆరో బంతికి టేలర్‌ను ఔట్ చేశాడు. దాంతో 16 ఓవర్లలో 88 పరుగులకే కివీస్ టీమ్ ఆలౌటయింది. 37 పరుగుల తేడాతో శ్రీలంక జట్టు విజయం సాధించింది.
⭐మలింగ రికార్డ్స్ :
అంతర్జాతీయ క్రికెట్ లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లను రెండు సార్లు పడగొట్టిన ఏకైక బౌలర్ గా మలింగ రికార్డు సృష్టించాడు. 36 ఏళ్ల మలింగ న్యూజిలాండ్ ఆటగాళ్లు కొలిన్ మన్రో ((12), హమీష్ రూథర్ ఫర్డ్ (0), కోలిన్ డి గ్రాండ్ హోమ్ (0), రాస్ టేలర్ (0)లను వరుస బంతుల్లో అవుట్ చేశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో ఐదుసార్లు హ్యాట్రిక్ సాధించిన బౌలరుగా కూడా మలింగ రికార్డు సృష్టించాడు. తద్వారా పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ షాహిద్ ఆఫ్రిది (97) రికార్డును బద్దలు కొట్టాడు.
ఆరు పరుగులకే ఐదు వికెట్లు తీసి తన కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. టీ20లో నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన రెండో బౌలర్ గా మలింగ అవతరించాడు. అంతకు ముందు రషీద్ ఖాన్ ఆ ఘనత సాధించాడు. ఆండ్రే రసెల్, ఆల్ అమిన్ హొస్సేన్ టీ20ల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశారు. టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో వంద వికెట్లు తీసిన బౌలరుగా కూడా మలింగ రికార్డు సృష్టించాడు.
💥100 వికెట్లు సాధించిన తొలి క్రికెటర్‌గా :
అంతేకాదు టీ20ల్లో 100 వికెట్లు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (97 వికెట్లు) పేరుపై ఉన్న రికార్డును మలింగ బద్దలుగొట్టాడు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.