Teluguwonders:
1995 -1998 మధ్యకాలం లో ..డైరెక్టర్ నాగ దర్శకత్వంలో వచ్చిన తెలుగు ధారావాహిక నాటిక ‘మర్మదేశం’… ఇది మొట్టమొదటగా తమిళంలో మర్మదేశం అనే పేరుతో వెలువడింది.
🔴’మర్మదేశం’.. ని మారువలేం :
1995 నుంచి 1998 మధ్య కాలం లో రాత్రి 9 అయిందంటే..చాలు అందరి కళ్ళు..చెవులు ఒక సీరియల్ కోసం ఎదురు చూసేవి. వెనుకాల గుర్రం పరుగెత్తుతూ సకిలించే సౌండ్.. గంభీరమైన గొంతుతూ ‘మర్మదేశం’ అంటూ వచ్చే వాయిస్ వింటే చాలు అంతా టీవీ ముందు వాలిపోయేవారు…వీరభద్రుడనే గ్రామదైవం గుఱ్ఱం మీద వచ్చి తప్పు చేసిన వాళ్లను శిక్షిస్తాడనే నేపథ్యంతో నడిచే కథ ఇది…ప్రముఖ రచయిత ఇందిరా సౌందరరాజన్ రాసిన ‘విట్టు వీడు కరుప’ అనే బుక్ ఆధారంగా ఈ సీరియల్‌ను రూపొందించారు. నిజ జీవితంలో ఉన్న కొన్ని ఆధ్యాత్మిక, ధార్మిక, మూఢ నమ్మకాలను ప్రతిభింబిస్తూ ఈ సీరియల్ సాగుతుంది. ఇన్నేళ్లు గడిచినా అప్పుడు ఆ సీరియల్ ని చూసిన అభిమానులు ఇప్పటికీ ఇంకా మరిచిపోలేదు.
👉భారతీయ ధారావాహిక రూపకర్త :
మిన్బిమ్బంగళ్
👉రచయిత :
ఇంద్రా సౌందర్ రాజన్
👉🔴ప్రముఖ తారాగణం :
డా॥కే.ఆర్ / డా॥కళ్యాణరాంగా ఢిల్లీ గణేశ్
మూగస్వామిగా చారుహాసన్
లలితగా వాసుకి
మణి సుందరంగా రాంజీ
దేవిగా నిమ్మీ
రుద్రపతి ఐపీఎస్ గా పూవిళంగు మోహన్
డా॥విశ్వరాంగా మోహన్ వి. రామ్
ప్రసాద్ గా ప్రిథ్వి రాజ్
గుడిలో పూజారిగా సదాశివం
రచయిత శ్రీకాంత్ గా ఇంద్రా సౌందర్ రాజన్
అణ్ణామలైగా నళినీకాంత్
వైద్యుడుగా కృష్ణన్
అంశవల్లిగా మోహనప్రియ
అగ్నిరాజుగా శుభలేఖ సుధాకర్
సీసీఐడీ ఆఫీసర్ గా అజయ్ రత్నం
🔴’మర్మదేశం’ ఇప్పుడు యూ ట్యూబ్‌లో :
1995 నుంచి 1998 మధ్య ఓ టెలివిజన్ ఛానెల్‌లో ప్రసారమై కోట్లాది మంది అభిమాన్ని చురగొన్న సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ ‘మర్మదేశం’ ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ‘మర్మదేశం’ ఇప్పుడు యూ ట్యూబ్‌లో ప్రాసారం చేస్తున్నారు. ఇకపై ప్రతీ సోమవారం నుంచి శనివారం వరకు యూ ట్యూబ్ చానెల్‌లో ప్రసారం అవుతుంది. శుక్రవారం రోజు ఈ సీరియల్‌కు సంబంధించిన 10 ఎపిసోడ్స్‌ను రిలీజ్ చేశారు. తమిళం, తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ప్రసారమైన ఈ సీరియల్ కోట్లాది మందిని ఆకట్టుకుంది. అయితే, మళ్లీ యూ ట్యూబ్ ఛానెల్‌లో ప్రసారమవుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ మర్మదేశం ఇప్పుడు తమిళంలో మాత్రమే ఉంటుంది.
👉రహస్యం 2-‘మర్మదేశం’ రహస్యం -నవపాషాణ లింగాల ఔషధ గుణాల గురించి తెలిపే కథ. ఈ వరుసలో మొదటిది,ఇది ఈటీవీలో ప్రసారమయింది.
మర్మదేశం – రహస్యం 2 గా జెమినీ టీవీలో ప్రసారమయింది.ఈ రహస్యం వరుసలో కొన్ని ధారావాహికలు వచ్చాయి. ఇవన్నీ కూడా అతీంద్రియ శక్తుల మీద రచింపబడినవి. ఇవన్నీ కాల్పనికాలయినప్పటికీ, నిజ జీవితంలో ఉన్న కొన్ని ఆధ్యాత్మిక, ధార్మిక, మూఢ నమ్మకాలను ప్రతిబింబిస్తాయి.
వీరభద్రుడనే గ్రామదైవం గుఱ్ఱం మీద వచ్చి తప్పు చేసిన వాళ్ళను శిక్షిస్తాడనే నేపథ్యంతో నడిచే మర్మదేశం ఇప్పుడు మళ్లీ అలరించనుంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.