థార్ పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు క్రిస్ హెమ్స్‌వర్త.మార్వెల్ హీరో క్రిస్ హెమ్స్‌వర్త్ అంటే తెలియని వాళ్లు ఉంటే ఉండచ్చేమోగానీ..థార్ అంటే తెలియనివాళ్లు మాత్రం అస్సలు ఉండరు. థార్ పాత్రతో అంతగా ఫేమస్ అయిపోయారు క్రిస్ హెమ్స్‌వర్త్.కాగా.. రీసెంట్‌గా ఒక మిడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు ముచ్చటించారు..అవి మీ కోసం.
🔴భారతదేశంలో షూటింగ్ అనుభవం: “భారత్‌లో షూటింగ్ ఎంతో ఎంజాయ్ చేశాను. ఆ సమయంలో షూటింగ్ చూడటానికి వేల మంది వచ్చేవారు. స్టూడియోలో ఉన్నప్పుడు ఇంత హడావుడి ఉండేది కాదు. అంతమందిని ఒకేసారి చూస్తే కంగారుపుట్టేది. వారంతా థార్ థార్….అని పిల్లుస్తుంటే ఎంతో థ్రిల్లింగా ఉండేది,” అంటూ షూటింగ్ విశేషాల గురించి ,షూటింగ్ అనుభవాలను గురించీ మిడీయాతో పంచుకున్నారు.
🔴తన కూతురికి ‘ఇండియా’ అని ఎందుకు పేరుపెట్టారో క్రిస్ వివరించారు.అది
ఆయన మాటల్లోనే…వినండి :
“నా భార్య ఇండియాలో చాలా కాలం పాటు గడిపింది. తనకు ఆ దేశం అంటే చాలా ఇష్టం. అందుకే మా పాపకు ఇండియా అని పేరు పెట్టుకున్నాం.” అని క్రిస్ అన్నారు.
👉క్రిస్, ఎల్సా దంపతుల సంతానం : క్రిస్, ఎల్సా దంపతులకు ఇండియా తో పాటు సాషా, టిస్టన్ అనే కవలలు కూడా ఉన్నారు . ఇవండీ మన థోర్ జీవిత విశేషాలు సంక్షిప్తంగా. కాగా ఆయన నటించిన మెన్ ఇన్ బ్లాక్ త్వరలో విడుదల కాబోతోంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.